సమాజంలో సామాజిక మాధ్యమాల ప్రభావం న్యూస్ పేపర్

సమాజంలో ఉంటూ సమాజం గురించి పాటుపడే వ్యవస్థలలో మీడియా ప్రధానంగా వారధిగా ఉంటుంది. మీడియా ఎటు చూస్తే అప్పటి పరిస్థితలలకు వారిదే బాధ్యతగా మేధావులు బావిస్తారు.

సామాజికపరమైన ఆలోచనలు కదిలితే అక్షరాలై అల్లుకుని ఇక్కడ ఈపోస్టులోకి వచ్చాయి. ఇది కేవలం ఆలోచనలు మాత్రమే… ఇది అభిప్రాయంగా ఎవరకి సూచించయంలేదు…

సమాజంలో నానా రకాల స్వభావాలు, నానానాయకులు, నానామతాలు, నానాకులాలు నానాజనులతో కూడి ఉంటుంది. అంతా కలిసి సామాజికంగా ప్రభావం చూపుతూ తమపై తాము ప్రభావం చూపుతారు. మాధ్యమాల ప్రభావం, సామాజిక మాధ్యమాల ప్రభావం సమాజంలో ఉంటుంది.

నాయకుల మాటలు మాధ్యమం ద్వారా మనకు చేరుతూ ఉంటాయి. అవి వైరల్ అవ్వడానికి సామాజిక మాధ్యమాల ప్రభావం సాయం చేస్తాయి. మనం మాట్లాడుకునే మాటలు మరలా సామాజి మాధ్యమాల ప్రభావం చేత మరలా వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా నాయకుల మాటలు, ఆ మాటల గురించి మనం మాట్లాడుకునే మాటలు ఒకరిపై ఒకరు సమాజంలో ప్రభావం చూపుతూ ప్రభావం అవుతూ ఉంటారు.

ఏదైనా సమాజంలో మనిషి, మనుషుల వలన సమాజం ప్రభావం చెందుతాయి. జనులు ఎన్నుకున్న నాయకులు సమాజం మీద ప్రభావం చూపుతారు. సమాజం మీద ప్రభావం చూపే నాయకులను ప్రజలే ఎన్నుకున్నారు కాబట్టి సమాజం మీద ప్రభావం చూపడంలో జనులే కీలకం. కానీ జనుల సమాజం మీద ప్రభావం చూపేది ఎవరో అనుకుంటూ తమ ప్రభావం తమకు పరిమితమనే భావన కలిగి ఉండవచ్చు.

మనం ఉండే సమాజం మనకు భద్రత కల్పిస్తుంది. మన చుట్టూ ఉండే సమాజం మనకు మొదటి నుండి అలవాటు అయి ఉంటుంది. మనం నివసించే సమాజం చుట్టూ మనకు అభిప్రాయం ఉన్నట్టే, మన చుట్టూ సమాజంలో మిగిలినవారికి ఉంటుంది. అలవాటు అయిన మన సమాజం మనకు భద్రతాభావం బలపరుస్తుంది. దాని వలననే ఉంటున్న ప్రాంతంలో మనకంటూ ఒక పట్టు ఏర్పడుతుంది.

సమాజం మనకు ఇచ్చిన గుర్తింపు వలన అది మన కుటుంబీకులపై కూడా ప్రభావం చూపుతుంది. మనకు సమాజం గౌరవంగా చూస్తే అదే గౌరవం మనపై ఆధారపడి ఉండేవారికి సమాజం నుండి వస్తుంది. మనపై అగౌరవభావం ఉంటే అది మనపై లేక మనపై ఆధారపడినవారిపై పరోక్షంగా ప్రభావం పడుతుంది. మనం నివసించే సమాజం మనపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపుతుంది. మనం కూడా సమాజంపై పరోక్షంగా ప్రభావం చూపుతూ ఉంటాము.

సమాజంలో సామాజిక మాధ్యమాల ప్రభావం న్యూస్ పేపర్ ప్రభావం

మన సమాజంలో సామాజిక మాధ్యమాల ప్రభావం నేటి రోజుల్లో అధికంగా ఉంటుంది. ఏదైనా న్యూస్ వైరల్ అవుతుందంటే దానిపై సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉంటుంది. న్యూస్ పేపర్ ప్రభావితం ఏనాటి నుండో సమాజం మీద చూపుతూ ఉంటుంది. అయితే అది దీర్ఘకాలిక ప్రభావం సమాజంలో పడుతుంది.

వర్తమానంలో నాయకుల మాటలు న్యూస్ పేపర్ ద్వారా సమాజంలో వ్యాప్తి అవుతాయి. అయితే గతంలో ఆ నాయకుడు మాట్లాడిన మాటలు, వర్తమానంలో నాయకుడు మాట్లాడిన మాటలు పోలిక లేకపోతే, ఆ మాటలు సామాజిక మాధ్యమాల ప్రభావం చేత వైరల్ అవుతాయి.సమాజంలో సామాజిక మాధ్యమాల ప్రభావం నాయకుల మాటలు చేత ప్రభావితం అవుతూ ఉంటాయి.

సామాజికంగా ప్రభావం పొందేవారు సమాజంలో ప్రభావం చూపుతారు. సమాజంలో ఎక్కువమంది ఫాలోయింగ్ ఉన్నవారి మాటల ప్రభావం సామాజికంగా ప్రభావం చెందుతాయి. అటువంటివారి నిర్ణయాలు, మాటలు సామాజిక మార్పుకు కారణం కాగలవు. విపత్కర పరిస్థితులలో అటువంటివారి ప్రభావం మరింతగా ఉంటుంది.

జనులలో ఎక్కువమంది ఏ వ్యక్తిని అనుసరిస్తే, ఆ వ్యక్తి వారిపై తిరిగి ప్రభావం చూపుతూ ఉంటారు. జనులు ఎక్కువగా వారిపై వారు ప్రభావం చూపుకోవడంలో నాయకులు ఒక కేంద్రబిందవుగా ఉంటారు. ఒక్కసారి జనులు ఎన్నుకున్న నాయకులు అయిదు సంవత్సరాల కాలంపాటు ప్రజలపై ప్రభావం చూపుతూ ఉంటారు.

పరిపాలన కాలంలో నాయకుల నిర్ణయాల కోసం చూసే జనులు విపత్తు కాలంలో నాయకుల దక్షతను

ఎన్నికల వేళలో జనులు ఎన్నుకున్న నాయకులు అయిదేళ్ల కాలం ఎన్నుకున్న జనులను పరిపాలిస్తూ ఉంటారు. ఆయా నాయకుల నానామాటలు మాధ్యమం ద్వారా జనులలో మనసులోకి చేరుతూ ఉంటాయి. ఆయా నాయకులు చేసిన నానాపనులను ప్రజలు గమనిస్తూ ఉంటారు. పరిపాలన కాలంలో నాయకుల నిర్ణయాల కోసం చూసే జనులు విపత్తు కాలంలో నాయకుల దక్షతను నిశితంగా పరిశీలిస్తారు.

విపత్తర సమయంలో నాయకులు చూపిన చొరవ, చేసిన సేవ జనుల మనసులో అలా ఉండిపోతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా అవి వైరల్ అవుతూ జనుల మనసులలో మెదులుతూనే ఉంటాయి. విమర్శలు వచ్చినా కూడా అంతే అవి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ జనులకు గుర్తు చేస్తూనే ఉంటాయి. విపత్తు వచ్చినప్పుడు నాయకుల శ్రద్ధ, వారి రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటగా మారుతుంది.

సామాజిక మాధ్యమాల ప్రభావం నాయకులపై ప్రభావం చూపుతూ జనుల మనసులలో నాయకుల గురించిన విశేషాలను గుర్తు చేస్తూ ఉంటాయి. అవి సృష్టించే న్యూస్ వైరల్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా నాయకులపై ప్రభావం చూపుతూ ప్రజలలోకి విశేషంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇవి న్యూస్ పేపర్ కన్నా ముందుగానే మేల్కొంటాయి.

అయితే సామాజిక మాధ్యమాల ప్రభావం వలన పుకార్లు ఎక్కువగా వ్యాప్తి చెందడం ఆందోళనకరం. ఏదైనా ఒక విషయం సామాజికపరంగా ప్రభావం చూపించేది ఉంటే, ఆ విషయంలో పుకారు న్యూస్ షికారు చేయడం ఎక్కువగా సమాజిక మాధ్యమాలలోనే జరుగుతుంది. ఈ మాధ్యమాలలో ఎవరైనా పోస్ట్ చేయవచ్చును కాబట్టి ఏవో మాటలను పోస్టు చేసి వాటిన వైరల్ చేయడం జరుగుతుంది.

ఈవిధంగా సామాజిక మాధ్యమాల ప్రభావంలో ప్రధానంగా పుకారు న్యూస్ ఎక్కువగా వ్యాప్తి చెందడం వలన వాటిపై కన్నా న్యూస్ పేపర్ పై నమ్మకం ఎక్కువ. అయితే అత్యసర పరిస్థితులో ఈ పుకార్లు అమాయక ప్రజలను నమ్మిస్తాయి. పుకారు వార్తలు షికారు చేయించడం చట్టరిత్యా నేరం. అయినా వీటిని సృష్టించి వైరల్ చేసేవారు ఎక్కువగానే ఉంటారు.

సామాజిక మాధ్యమాల ఆవశ్యకత అవసరం అయితే అవి సామాజిక శ్రేయస్సుకోసం వైరల్ కావాలి

నేటికాలంలో ఏదైనా విషయం వ్యాప్తి చెందడంలో సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉంటుంది. దిశకేసులో అత్యంత త్వరగా నేరస్తులకు శిక్షపడిందంటే మాత్రం దానికి కారణం సామాజిక మాధ్యమాల ప్రభావం చేత ప్రభావితమైన ప్రజలే. అందుకే సామాజిక మాధ్యమాల ఆవశ్యకత అవసరం అయితే అవి సామాజిక శ్రేయస్సుకోసం వైరల్ కావాలి కానీ సామాజిక ఆందోళనను పెంచేవిధంగా ఉండ కూడదు. ఈ విషయమే ప్రముఖులు కూడా చెబుతూ ఉంటారు.

మాధ్యమం ఏదైనా సమాచారం జనులకు చేరడమే.. అయితే ఆ సమాచారం వాస్తవానికి దూరంగా ఉండకూడదు. వాస్తవానికి దగ్గరగా ఉన్నా ఆందోళను కల్గించే విధంగా న్యూస్ ఉండకూడదు. విశ్లేషణాత్మకంగా ఆందోళన రహితంగా న్యూస్ ఉండాలి అంటారు. మరి అటువంటి విధానం లేకుండా సామాజిక మాధ్యమాలు ఉంటే వాటి ప్రభావం ప్రజలపై విపరీత ప్రభావం చూపుతాయి.

దిశ, నిర్భయ లాంటి చట్టాలు రావడానికి సామాజిక మాధ్యమాల ప్రభావం ఉంది. చాలా విషయాలు అప్పటికప్పుడు జనులు తెలుసుకోవడంలో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కానీ పుకార్లు కూడా వైరల్ అవ్వడమే ఆందోళకరం… మన చట్టాలు కూడా పదిమంది నేరస్తులకు శిక్ష నుండి తప్పించుకున్నా ఒక అమాయకుడికి కూడా శిక్ష పడకూడదనే రూల్స్ ఉంటాయి. అటువంటిది అమాయకులను బలిచేసే ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందడం మాత్రం ఆశాజనకం కాదు.

ఫేక్ న్యూస్ పాపులారిటీ రావాడానికి ప్రధాన మూలం సామాజిక మాధ్యమాల ప్రభావం అనే అంటారు. కాబట్టి మనపై ప్రభావం చూపే అటువంటి ఫేక్ న్యూస్ కు మనం ప్రధాన్యత ఇవ్వకుండా ఉండాలి. ఎవరో ఒకరు సృష్టించే ఈ ఫేక్ న్యూస్ షేర్ చేసేటప్పుడు ఆలోచించకుండా షేర్ చేస్తే మనం కూడా ఆ పుకారు షికారు చేయడంలో సాయం చేసినవారం అవుతాం.

ప్రధాన న్యూస్ పేపర్స్ కూ వెబ్ సైటులు కూడా ఉండడం చేత సమాజంలో సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ పుకారో, కరెక్టు న్యూసో తేల్చుకోవడం తేలిక

కాబట్టి ఫేక్ న్యూస్ ప్రభావం తగ్గించేవిధంగా మనం ఏది పడితే అది సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలి. మనం సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు ఆ న్యూస్ యొక్క మూలం చూడాలి. ఇక ఆన్యూస్ పై ప్రధాన న్యూస్ చానల్స్ లేదా న్యూస్ పేపర్స్ లో ఉందో లేదో చూసుకుని షేర్ చేయాలి. ఇప్పుడు ప్రధాన న్యూస్ పేపర్స్ కూ వెబ్ సైటులు కూడా ఉండడం చేత సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ పుకారో, కరెక్టు న్యూసో తేల్చుకోవడం తేలిక.

అందువలన మనకు సోషల్ మీడియాలో ఏదైనా ఎట్రాక్టివ్ న్యూస్ కనబడగానే షేర్ చేయకుండా, ఆ న్యూస్ మూలంపై దృష్టిపెట్టాలి. ప్రధాన న్యూస్ వెబ్ సైట్లలో న్యూస్ సరిచూసుకోవచ్చును. తర్వాత ఆన్యూస్ లో నిజముంటే షేర్ చేయవచ్చును. సామాజిక శ్రేయస్సు కొరకు షేర్ చేయాల్సిన న్యూస్ షేర్ చేయాలి. ఎందుకంటే సామాజిక శ్రేయస్సు అందరికీ మేలు కాబట్టి.

ప్రధాన న్యూస్ పేపర్ వెబ్ సైట్లలో ఈనాడు.నెట్, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ తెలుగు న్యూస్ పేపర్ల వెబ్ సైటులు మనకు ఆన్ లైన్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తాయి. వీటిలో లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. వీటి ద్వారా మనం మనకు సోషల్ మీడియాలో కనబడిని న్యూస్ లో నిజమెంత తెలుసుకోవచ్చును.

ఫేక్ న్యూస్ ఎట్రాక్టివ్ గా ఉంటే అప్పటికి అతి ప్రయోజంగానో, ఆందోళనను పెంచేవిధంగానో ఉంటాయి. ఎందుకంటే వాటి మూల ఉద్ధేశ్యం వైరల్ కావడామే లక్ష్యంగా ఉంటాయి కానీ వాస్తవంతో పని ఉండదు. వాస్తవం ఉందా లేదా అనేది షేర్ చేసే ముందు మనమే చెక్ చేసుకోవాలి. తద్వారా ఫేక్ న్యూస్ వైరల్ కాకుండా మనం అడ్డుకున్నవారమవుతాం. విపత్కర పరిస్థితులలో ఇది అందరి సామాజిక బాధ్యత కూడాను. ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి.

పుకారు పుట్టించడంలో వ్యాప్తి చేయడంలో ఉండే వేగం అ పుకారులో వాస్తవం వ్యాప్తి చెందడంలో తక్కువగా ఉండదు. ఒకవేళ అది ఆందోళనకరమైన న్యూస్ అయితే సామాజికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఫేక్ న్యూస్ పై చట్టరిత్యా చర్యలు కూడా ఉంటాయి. పుకారు పుట్టించేవారికి సామాజిక బాధ్యత ఉండదు. కానీ వ్యాప్తి కాకుండా అడ్డుకోవడంలో మాత్రం షేర్ చేసేవారు చూడాలి.

ఇప్పుడు కరోనా సంక్షభం ప్రపంచమంతా ఎదుర్కొంటుంది. ఈ కరోనా అంటువ్యాధి అంతటా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి సోకింది. మన ఇండియాలో ఐతే కరోనా అయిదువేలు లోపే ఉంది. కానీ ఇండియాలో కొనసాగుతున్న లాక్ డౌన్ విషయంలోనూ పుకారు వార్తలు వ్యాపించాయి. ఇంకా ఫేక్ న్యూస్ కరోనా వైరస్ గురించి వ్యాపించాయి.

ఈ కరోనా వైరస్ వలన నష్టంతో బాటు కరోనా వైరస్ గురించి ఫేక్ న్యూస్ వలన కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ గురించి అధికారిక వెబ్ సైట్లలో న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ అధికారిక వెబ్ సైటులో కరోనా వైరస్ గురించిన న్యూస్ మనకు అందుబాటులో ఉంటుంది. ఆ వెబ్ సైటు లింకు బటన్ క్రిందగా ఉంది చూడండి.

న్యూస్ పేపర్స్ సమాజంలో

నానాటికీ పెరుగుతున్న న్యూస్ చానల్స్, యూట్యూబ్ చానల్స్ ఎన్ని ఉన్నా న్యూస్ పేపర్స్ చదివేవారు ఇప్పటికీ ఉంటారు. టివిలో చూసిన న్యూస్ అయినా, సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ అయినా న్యూస్ పేపర్స్ లో చదవడం ఒక అలవాటుగా ఎక్కువమందికి ఉంటుంది. న్యూస్ పేపర్స్ సమాజంలో ప్రభావం దీర్ఘకాలికంగా చూపుతాయి.

న్యూస్ పేపర్స్ న్యూస్ నమ్మదగినవిగా ఉంటాయి. సాదారణంగా న్యూస్ పేపర్స్ ద్వారా ఫేక్ న్యూస్ వ్యాప్తి ఉండదు. సహజంగా న్యూస్ పేపర్స్ ఒక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నియంత్రణలో ఉంటాయి. కాబట్టి వీటి నుండి పుకారు వార్తలు వ్యాపించవు. అందువలన కావచ్చు. న్యూస్ పేపర్స్ చదివేవారు న్యూస్ చానల్ చూసినా మరుసటి రోజు పేపర్ చదివే అవకాశం ఎక్కువ.

రాజకీయ, సామాజిక, వ్యాపార, వాణిజ్య, క్రీడా, సినిమా విశేషాలు న్యూస్ పేపర్స్ ప్రచురితం చేస్తూ ఉంటాయి. వాటిని ఫాలో అయ్యేవారు కూడా ఆయా విషయాలలో న్యూస్ చదువుతూ సామాజిక అవగాహనను పెంపొందించుకుంటారు. ఇంకా న్యూస్ పేపర్స్ న్యూస్ కరెంట్ అఫైర్స్ గా కూడా ఉపయోగపడతాయి.

సమాజంలో జరిగిన వివిధ ఘటనలు, ప్రభావిత రాజకీయ నిర్ణయాలు న్యూస్ పేపర్స్ లో కధనాలుగా కూడా వస్తాయి. ఈ కధనాలు సామాజిక శ్రేయస్సు కోసం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఉంటాయి. సామాజిక మాధ్యమాలలో న్యూస్ వైరల్ అయినా అది న్యూస్ పేపర్స్ లో ప్రచురితం కాలేదు అంటే అది అవాస్తవంగా పరిగణించేవారు కూడా అధికంగా ఉంటారు. కాబట్టి న్యూస్ పేపర్స్ సమాజిక విశ్వసనీయతను కలిగి ఉంటాయి.

ఇవి సమాజంలోని జరుగుతున్న మార్పులను, సామాజిక పోకడలను విశ్లేషిస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ కధనాలు దీర్ఘకాలిక ప్రభావం సమాజంపై చూపుతాయి. కధనాల కలిగించే కదలికలను న్యూస్ రీడర్స్ మైండులో స్టోర్ అవుతాయి. మరలా ఇవి ఎన్నికల వేళ రాజకీయాలను ప్రభావితం చేయడంలో పరోక్ష ప్రభావం చూపుతాయి.

మేలైన విషయం న్యూస్ పేపర్స్ ద్వారా పుకారు న్యూస్ సామాజిక మాధ్యమంలో వచ్చినట్టుగా రావు.. ఇంకా రాజకీయ ప్రభావం మాధ్యమంపై పడుతుంది. మాధ్యమంలో వచ్చే న్యూస్ రాజకీయంగా ప్రభావం చూపుతాయి. ఆపై ప్రజలపై ప్రభావం చూపుతాయి. కరోనా వైరస్ గురించి న్యూస్ పేపర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాయి. కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు ఎక్కువగా చూపుతూ ఉంటాయి. ఏదైన విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వమును జాగురతలో ఉండేలాగా న్యూస్ పేపర్స్ న్యూస్ సూచిస్తూ ఉంటాయి. ఆ విధంగా న్యూస్ పేపర్స్ సమాజంపై ప్రభావం చూపుతూ ఉంటాయి.

కరోనా వైరస్ గురించి కరోనా వైరస్ జాగ్రత్తలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కరోనా వైరస్ గురించి ప్రభుత్వ సూచనలు, కరోనా వైరస్ గురించి నాయకుల అవగాహనా చర్యలు. కరోనా వైరస్ గురించి వైద్యులు సూచించే సూచనలు. కరోనా వైరస్ గురించి ప్రభుత్వం తీసుకునే చర్యలు. కరోనా వైరస్ గురించి సమాజంలో జరుగుతున్న చర్చ. ఇలా కరోనా గురించి ప్రపంచం అంతా ఆందోళన చెందుతుంది. అటువంటి కరోనా గురిచం తగు సూచనలను సరైన న్యూస్ చేరవేయడంలో మీడియాదే కీలక పాత్ర.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర కీలకమైతే, మీడియా ద్వారా కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత విజ్ఙులైన అందరికీ ఉంటుంది. ఈ కోణంలో మనకు తెలుగు సినీ నటులు, సామాజిక విశ్లేషకులు కూడా మనకు కరోనా వైరస్ గురించి సూచనలను తెలియపరుస్తున్నారు. అయితే అందరూ సూచించేది, అడిగేది, చెప్పేది ఒక్కటే… అంతా ఇంటికే పరిమితం అవ్వండి… సామాజిక దూరం పాటించండి. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమాలు పాటించండి. ఇవే వాటిని పాటించడం సామాజికపరంగా మన కర్తవ్యం కూడాను.

సమాజంలో నివసిస్తున్న మనకు సామాజికపరంగా తగు జాగ్రత్తలు విపత్కర పరిస్థితులలో పాటించాలి. వైద్యులు, ప్రభుత్వం సూచించిన సూచనలు తుచ తప్పకుండా పాటించాలి. అప్పుడే ప్రకృతి నుండి వచ్చిన విపత్తులు తగ్గుముఖం పట్టేది. గతంలో ప్రకృతి విపత్తులకు బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం వైపే అన్నీ చూసేవి. మీడియా ప్రభుత్వ చర్యలనే చూసేది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ గురించి మీడియా ప్రజలను చూస్తుంది. అంటే కరోనా వైరస్ గురించిన సామాజిక బాధ్యత ఎవరికి ఎక్కువగా ఉందో మీడియా దృష్టి చెబుతుంది.

కరోనా వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ప్రజలు తమవంతు ప్రయత్నం సిన్సియరుగా చేయాలి. ఇదే సామాజిక పరంగా మన అందరి సామాజిక బాధ్యత. సమాజంలో జీవించే మనమంతా సామాజిక శ్రేయస్సు కోరుకుంటూ, సమాజం కోసం సామాజిక దూరం పాటించాలి. సమాజంలో ఉంటూ సమాజానికి అవసరం అయినప్పుడు మనవంతు సామాజిక బాధ్యత మనం నెరవేర్చాలి. సమాజంలో నేడు కరోనా వైరస్ గురించి ప్రజలలో ఉండే పరివర్తననే మీడియా మరియు మీడియా ద్వారా ప్రముఖులు గమనిస్తున్నారు.

సమాజంలో విశ్లేషకులు, ప్రముఖుల, పండితులు మీడియ ద్వారా ఎటువైపు చూస్తారో వారిదే అప్పటి సామాజిక పరిస్థితులపై బాధ్యత… ఇప్పుడు వారు జనులవైపే చూస్తున్నారు. సాదారణంగా సమాజంలో ఎన్నికల వేళలో ప్రజలవైపు వైపు చూస్తారు. కానీ నేడు కరోనా వైరస్ గురించి ప్రజలను గమనిస్తున్నారు.

ధన్యవాదాలు

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.