కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం చాలా ప్రధానం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారు 1మిలియన్ దగ్గరగా ఉంది.

వేగంగా విస్తరిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు, ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదృష్టవశాత్తు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే లాక్ డౌన్ ప్రకటించారు. కాబట్టి కరోనా విస్తరణ త్వరగా వ్యాప్తి చెందలేదు.

అయినా కరోనా కేసులు ఇండియాలో 1834 కరోనా పాజిటివ్ కేసులుగా ఉన్నాయి. కరోనా మరణాలు 41కు చేరుకుంది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తక్కువే… కానీ పోయింది ఒక్క ప్రాణం అయినా తిరిగి తీసుకురాలేం.

ముఖ్యంగా అంటువ్యాధి కాబట్టి ఒకరి నుండి మరొకరికి వెళ్ళడం వలన ఒక వ్యక్తి చావుకు మరొక వ్యక్తి కారణం కాగలడు. సాటివ్యక్తి మరణానికి మనమెందుకు కారణం కావాలి? సామాజిక బాధ్యతగా మనం ఈ ప్రశ్నవేసుకోవాలి.

ఈ సమాజం మనకు ఉండడానికి స్థలం ఇచ్చింది. ఈ సమాజంలో గాలి, నీరు ఉపయోగించుకుంటున్నాం. ఇతరులతో కలిసి పనిచేస్తున్నాం. ఒకరి నుండి మరొకరు సాయం పొందుతున్నాం. కాబట్టి మనవలన సమాజానికి హాని కలుగుతుందంటే, ఖచ్చితంగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కాలం కాబట్టి ఇంటికే పరిమితం కావాలి.

ముఖ్యం మానవుడు గుర్తెరగాల్సిన విషయంగా ఒక్కటి చెబుతారు. ప్రపంచంలో విలువ కట్టలేని మెకానిజం ఉన్న యంత్రం అంటే మనిషి శరీరమని అంటారు. అటువంటి మనిషి ప్రాణం పోతే తీసుకురాలేం…

కొవిడ్-19 వైరస్ వచ్చె మనకు కష్టాలె తెచ్చె. ఈ మహమ్మారి మనమీదకు ఎందుకు రావాలి? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉపాధి కోసం ఖండాంతరాలు దాటి ఉండడం చేత, అంటువ్యాధి ఒక ప్రదేశంలో పుడితే ప్రపంచం అంతా పాకే అవకాశం ఉంది.

ఇక కరోనా (కొవిడ్-19) వైరస్ అంటువ్యాధిగా నిర్ధారించారు. చాలా మందికి ఈ వైరస్ సోకి మరణం పొందారు. లక్షలమందికి కొవిడ్-19 పాజిటివ్ రాగా వేలమంది మరణించారు. ఈ మహమ్మారి ఇంకా పాకుతుంది.

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం
కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం

వైరస్ వచ్చిందంటే మందు ఉండాలి. కానీ కరోనా వైరస్ కొత్తది. ఇంకా మందు తయారు కాలేదు. ప్రస్తుతం మందు తయారుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి కొవిడ్-19 వైరస్ కు నివారణ ఒక్కటే మార్గంగా చెబుతున్నారు.

చైనాలో తొలి కరోనా మరణం సంభవించింది. ఇప్పటికి నలభైవేలకు పైగా కరోనా మరణాలు సంభవించినట్టుగా సమాచారం. ఈ కింది బటన్ పై క్లిక్ లేదా టచ్ చేయడం ద్వారా కొవిడ్-19 వైరస్ స్టాటిక్స్ మ్యాప్ చూడవచ్చును.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కాబట్టి లాక్ డౌన్ నియమాలు అందరం పాటించాల్సిందే… కారణం కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించారు. కరోనా వ్యాప్తి చెందితే, అధిక మరణాలు సంభవించే అవకాశం అధికంగా ఉంది.

ఇక లాక్ డౌన్ అంటే ప్రజలు పూర్తిగా ఇళ్ళకే పరిమితం కావడం. ఇంతకమించిన మార్గం లేదని ప్రపంచవ్యాప్తంగా పరిశీలకుల అభిప్రాయము కూడాను… కాబట్టి ఇంటికే పరిమితం అయ్యి, కరోనా కట్టడికి సహకరించాల్సి కనీస సామాజిక బాధ్యతగా ఉంది.

కరోనా నివారణకు జాగ్రత్తలు

ప్రభుత్వం ప్రకటించింది అంటే అది కర్తవ్యం అయ్యి ఉంటుంది. కర్తవ్య నిర్వహణలో భారతీయుల కంటే మిన్నగా ఉండేవారు ఎవరుంటారు? కాబట్టి లాక్ డౌన్ నియమాలు పాటించడం మన సామాజిక బాధ్యత… అదే సమాజానికి శ్రీరామరక్ష.

ఈ కరోనా వలన ఖాళీగా సమయం గడపడానికి నేడు అనేక సాంకేతిక మార్గములు, పరికరాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి.

సాంకేతిక పరికరాల ద్వారా వినోద కార్యక్రమములు వీక్షించవచ్చును. బుక్స్ చదువుతూ విజ్ఙానం పెంచుకోవచ్చును. ఇంటర్నెట్ ద్వారా పరిశోదన పరమైన విషయాలను తెలుసుకోవచ్చును. కాలం తెచ్చిన ఖళీని విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవచ్చును.

లాక్ డౌన్ సందర్భంగా ప్రధానంగా చెబుతున్న అంశం…. సామాజిక దూరం. ప్రజలంతా గుంపుగా ఉండకుండా ఉండడం. గుంపులు గుంపులుగా జనం గుమికూడకుండా ఉండడం… చాలా ప్రధానం.. ఒకరికొకరు దూరంగా ఉండడం…. వీలైతే లాక్ డౌన్ కాలంలో ఒంటరిగా ఉండడం చాలా ప్రధానం.

ఒంటరిగా రోజుల తరబడి ఉండడం వలన వీలైనంత మంది ఇలా చేస్తే, అంత త్వరగా కరోనా వ్యాప్తి చెందదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే, ఇప్పటికే సోకినవారికి వైద్యం అందుతుంది. ఇప్పటికే కరోనా సోకినవారికి వైద్యం అందిస్తున్న వైద్యులు కత్తిమీద సాము చేస్తున్నట్టే…

ఇటువంటి సమయంలో బయటికిపోయి, కరోనా తెచ్చుకుని, మరలా దానిని వేరొకరికి అంటించి తద్వారా ఎక్కువ మంది కరోనా బారిన పడితే, వైద్యబృందానికి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కరోనా కాలంలో విధించబడిన లాక్ డౌన్లో మనం ఇంటికే పరిమితం..

కరోనా వైరస్ మనకి తెలియని 9 విషయాలు అంటూ బిబిసి పోస్టు చేసింది. ఆపోస్టును చదవడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి లేదా టచ్ చేయండి.

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం

కరోనా కట్టడికి మన దగ్గర ఉన్న ఆయుధం… ఇంటికే పరిమితం కావడం… వీలైనంత ఎక్కువగా వీలైనన్ని రోజలు ఒంటరిగాను ఉండడం… ఇతరులతో మితంగా మాట్లాడడం… సామాజిక దూరం పాటించడం… ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవడం… ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయకుండా ఉండడం.. ఒకవేళ చేతులతో ఏదైనా పట్టుకుంటే, ఆ చేతులు వెంటనే ముఖంపై పెట్టకుండా ఉండడం…. చేతులు ఎప్పకప్పుడు శుభ్రం చేసుకోవడం.

వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనం తీసుకునే జాగ్రత్తలే మనకు రక్షణ, అదే సమాజానికి శ్రీరామరక్ష. మనం కష్టపడి మన పిల్లలకు ఎంతోకొంత ముట్టచెబుతాం… అలాగే సామజికపరమైన బాధ్యత.. మన సమాజాన్ని మనం కాపాడుకోవడం.

కరోనా వ్యాధి అంటువ్యాధి కాబట్టి, అది ఒకరి నుండి మరొకరికి, వస్తువు నుండి మరొకరికి లింకింగ్ విధానం ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ లింకులో ఉండకుండా జాగ్రత్త పడడం. మన జాగ్రత్త వలన మనం సేఫ్.. మన సేఫ్ అయితే మనవలన మన సమాజానికి రక్షణే.

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం కనీస సామాజిక బాధ్యత

కనీస సామాజిక బాధ్యతగా సామాజిక దూరం పాటించడం… లాక్ డౌన్ నియమాలు పాటించి ఇంటికే పరిమితం కావడం మన బాధ్యత… మన జాగ్రత్తే మనకు రక్షణ. అదే సమాజానికి శ్రీరామరక్ష…

సామాజిక దూరం పాటించకపోతే, కరోనా వ్యాధిగ్రస్తుల ద్వారా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ప్రమాదం ఉన్నప్పుడు విజ్ఙులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అధికారిక సూచనలు తుచ తప్పక పాటిస్తారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరొక ప్రక్క కరోనా మరణాలు పెరుగుతున్నాయి. మరణించిన ప్రాణం రాదు, కానీ కరోనా వైరస్ వలన మరణిస్తే, ఆవ్యక్తి ద్వారా అప్పటికే కొంతమందికి కరోనా వైరస్ సోకే అవకాశం అధికంగా ఉంటుంది.

అటువంటప్పుడు కరోనా సోకకుండా మనకు మనమే జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానం. స్వీయ నియంత్రణ పాటించడం వలన మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వెలకట్టలేని మానవ శరీరం, అందుంలో ఉండే మనసు, దాని పనితీరు వీటి గురించి అవగాహన సరిగ్గా ఉంటే ప్రాణం విలువ తెలిసి ఉంటుందంటారు.

కనురెప్పలో వెంట్రుకలు తలలో పెరిగనట్టు పెరగవు. చేతి వేళ్ళకు ఉన్న గోరులు శరీరంలో ఎక్కడా ఉండవు. ఎంత క్వాలీటి కలిగినా కెమెరా అయిన మనిషి కంటి ముందు చిన్నబోతుంది. మనిషి శరీరం ఒక అద్భుతమే అంటారు.

ఇక అందులో ఉండి, లోకాన్ని చూసే మనసు అయితే మరింత ఆసక్తికరం. మనసు ద్వారా మనం చేయలేనిది ఏమి ఉండదు. టివి వార్తల్లో అమెరికా చూస్తూనే, మనసు ఆమెరికా వెళ్లి వచ్చేస్తుంది.

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం

ఎక్కడికైనా ప్రయాణం అయితే గమ్యస్థానానికి మనసు వెళ్ళి అక్కడి పరిస్థితులను అంచానా వేసి చెప్పగలదు. ఇంకా అక్కడి వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉండగలదో కూడా ఊహించగలదు. అంతెందుకు రోజూ క్రమం తప్పకుండా నియమానుసారం పూజ చేస్తే, అటువంటి మనసు నింగిలోని దేవుడినే నేలపైకి తీసుకురాగలదు అంటారు.

అంతటి పవర్ పుల్ మైండు, దానికి ఆశ్రయం ఇచ్చే శరీరం అంటే శ్రద్ద మరింతగా ఉండాలి. అలా మనలాగానే మనతో మన సమాజంలో ఉండే ఇతరులు కూడాను… మరీ మనం బయటకుపోయి కరోనా వైరస్ అంటించుకుని మనం ఇతరులకు అంటించేలాగ ఉండడం ఎందుకు?

ఒకప్పుడు గొప్ప పని అంటే ఏదో పెద్ద పని. కానీ ఇప్పుడు అందరూ గొప్పవారే ఇంట్లోనే ఉంటే. కరోనా వ్యాధి సోకకుండా జాగ్రత్త తీసుకుంటే, మీ వలన సమాజానికి మేలు చేసినవారే అవుతారు. కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం మినహా మరో మార్గం లేదు. కాబట్టి లాక్ డౌన్ నియమాలు పాటిద్దాం.. కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా జాగ్రత్త పడుదాం..

మన వైద్య సిబ్బందికి ఇబ్బందులు తెచ్చే పరిస్థితులను అడ్డుకుందాం… కరోనా కట్టడికోసం ఇంటికే పరిమితం అవుదాం… ఇంతకు మించి ఏముంది.. ఈకాలంలో మనం చేయగలిగింది.

ఇప్పటికే వైద్యులు వైద్యం చేస్తున్నారంటే, వారి ప్రాణాలు పణంగా పెట్టి కరోనాపై పోరాటం చేస్తున్నారు. కనబడని శత్రువుతో యుద్దం చేస్తున్నారు. వారు అంతగా సామాజిక సేవ చేస్తుంటే, మనం కనీస సామాజికసేవగా కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం చాలా ప్రధానం.

కరోనా కష్టకాలంలో మనకు మరింత ఇబ్బందిగా ఉంటే అంతకన్నా ఇబ్బంది డాక్టర్లకు పోలీసులకు..

మనకు కరోనా సోకుతుందని రోడ్లపైకి రావద్దని, పోలీసులు రోడ్లపై తిరుగుతున్నారు. రోడ్డుపై ఉంటే కరోనా సోకే అవకాశం ఎక్కువ, అయినా వారు రోడ్డుపై తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారు. చాలామంది ఇంటికే పరిమితం అయ్యారు.

ఎక్కువమంది ఇంట్లోనే ఉన్నారు. వారు మంచవారు. రోడ్డుపైకి వచ్చేవారు ఎలా పోతే నాకేం. నేను ఇంట్లోనే ఉంటే నాకు కరోనా రాదు కదా అని పోలీసు అనుకంటే… కరోనా మనం ఇంట్లోనే ఉన్నా మన ఇంటికే చేరే అవకాశం అధికం అవుతుంది.

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం వలన మన సామాజిక సేవ చేసినవారం అవుతాం. ఒకప్పుడు సామాజిక సేవ అంటే, ఏదో పెద్ద పనిని నలుగురితో కలిసి చేయాలి. కానీ ఇప్పుడు సామాజిక సేవ ఒంటరిగానే ఇంట్లో కూర్చోవడమే పెద్ద సామాజిక సేవ.

ఎంత చెప్పినా వినకపోవడం మూర్ఖత్వం. సామాజిక సమస్యల కాలంలో మనుజులు మూర్ఖత్వంగా ఉండకూడదు. కరోనా వైరస్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి… దీనిని తరిమ కొట్టాలంటే యుద్దమే చేయాలి. అందరూ చేయాలి.

కాకపోతే ఎవరింట్లో వారే సామాజిక దూరం పాటిస్తూ యుద్దం చేయాలి. బోర్డర్లో శత్రువు కంటికి కనబడితే, సమాజంలో ఉన్న కరోనా కంటికి కనబడదు. దీనిపై పోరాటంలో దీనిని నివారించడమే ప్రధానం.

స్వీయనియంత్రణ, స్వీయనిర్భంధం, స్వీయరక్షణ ఇవే నేటి కరోనా కల్లోలంతో మనకు వినిపిస్తున్న మాటలు. స్వీయ నియంత్రణ అంటే మనకు మనమే నియంత్రించుకోవడం. స్వీయనిర్భంధం అంటే మనింటికే మనం పూర్తిగా పరిమితం కావడం. స్వీయరక్షణ ఒకవేళ కరోనా లక్షణాలు కనబడితే పరీక్షలకు మనమే వెళ్ళడం…

మనకు మనమే కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం వలన మనం కరోనా వ్యాప్తి చెందకుండా కృషి చేసినవారమవుతాం. కరోనా నివారణకు ప్రభుత్వం సూచించిన సూచలను పాటించడం మినహా మరో మార్గం లేదనేది… విశ్లేషకుల మాట.

నివారణకు జాగ్రత్తలు తీసుకుంటూ మనం మనపై నియంత్రణ కలిగి ఉండాలి. ఇంటికే పరిమితం అవ్వడంతో దొరికే ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యోగ సరైనదిగా చెబుతున్నారు.

ఒంటరితంగా ఉండాలంటే ఎక్కువమందికి ఇబ్బంది. మనసు కుదురుండదు. ఎవరో ఒకరితో మాట్లాడడమో లేక ఏదైన పని చేయడమో.. ఏదో ఒక వ్యాపకంతో ఉండే మనసుకు ఒకే చోటా కొన్ని రోజులపాటు కట్టడిగా ఉండాలంటే కష్టమే.

కానీ తప్పనిసరి స్థితిలో ఇంట్లో ఉండాలి కాబట్టి వ్యక్తిగతంగా శ్రద్ద పెట్టడమే మేలు అంటారు. కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం లో భాగంగా… యోగ చేయడంతో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందంటారు.

యోగా వలన శరీర ఆరోగ్యస్థితి మెరుగుపడితే, ధ్యానం వలన మనసు ప్రశాంతతను పొందుతుందంటారు. ప్రశాంతంగా ఉండే మనసు మరింత శక్తివంతంగా మారుతుంది. కాబట్టి యోగ, ధ్యానం కరోనా కలిగించిన ఖళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మేలు అంటారు.

ఇంకా బుక్ రీడింగ్ ఇదొక వైజ్ఙానిక శోధనం. పుస్తకాలు చదువుతూ ఉంటే, అ పుస్తకాలలో ఉన్న అంశంతో మనసు కాసేపు తాదాత్మత చెందుతుంది అంటారు. అంటే ఆ విషయంలో అవగాహన మనసుకు మరింత అందుతుంది.

మన అభిరుచికి తగ్గట్టుగా వివిధ రంగాలలో వివిధ అంశాలలో ఉండే బుక్స్ చదవడం వలన ఆయా విషయాలపై విజ్ఙానం మరింతగా పెరుగుతుంది.

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం లో ముఖ్యంగా ఇంటికే పరిమితం కావడం, పరిశుభ్రంగా ఉండడం, సామాజిక దూరం పాటించడం. కరోనా సోకకుండా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ, ఖాళీ సమయం సద్వినియోగ పరచుకోవడంలో ఇంకా ప్రవచనలు వినడం కూడా చేయవచ్చును.

ప్రముఖుల ప్రవచాలు ఆద్యాత్మిక భావనలను పెంచుతాయి. ఇంకా వైజ్ఙానిక పరమైన విషయాలలో వివిధ విశ్లేషకుల విశ్లేషణలు కూడా యూట్యూబ్ ద్వారా చూడవచ్చును. నేటి సమాజంలో సాంకేతికతకు కొరతలేదు. కాబట్టి అనేక విషయాలు ఇంటి నుండే తెలుసుకోవచ్చును. అభిరుచి ఉంటే, ఇంటినుండే నేర్చుకోవచ్చును.

ఇంటినుండే ఆన్ లైన్ ద్వారా ఇతరులకు తెలియపరచవచ్చును. సోషల్ మీడియా ద్వారా ఉపయుక్తమైన విషయం తెలిసి ఉంటే అందరికీ షేర్ చేయవచ్చును. ఈ విధంగా నేటి కాలంలో ఇంట్లో కొన్ని రోజులపాటు కట్టడిగా ఉండవచ్చును.

సాంకేతిక పరికరాలు, ఇంటర్నెట్ రెండూ మనిషికి ఒంటరితనం పెంచుతున్నాయని విశ్లేషించినవారు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఆ ఒంటరితనం కరోనా నుండి కాపాడుకోవడంలో మాత్రం సహాయకారిగా ఉంటుంది.

అయితే ఒంటరిగా ఉండడం కరోనా కాలంలో బాగానే ఉంటుంది. కానీ సాదారణ రోజులలో ఒంటరిగానే ఉండడం అంత శ్రేయష్కరం కాదని అంటారు. ఏదైనా తాత్విక పరిశీలనలో ఉండేవారే ఒంటరితనానికి దగ్గరగా ఉంటారని అంటారు.

ఏదీ ఏమైనా కరోనా కల్పించిన ఈ ఖాళీ సమయం ఇంటిపనులు చేసుకుంటూ, ఇంటికే పరిమితవం అవ్వడం. ఇంటి పనిలేకపోయినా కల్పించుకుని ఇంటి పనిని చేయడం. లేదా ఏదైనా వైజ్ఙానిక వీడియోల వీక్షణ, ప్రవచనాల వీక్షణ.. చేయవచ్చును. ప్రవచనాలు వినవచ్చును. పండితులు మాటలను వినవచ్చును.

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు. పుస్తకాలు చదువుతూ కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చును. పుస్తకాలు మనసుకు మరింత బలాన్నిస్తాయి. ఇంకా సాంకేతిక పరికరాల వినియోగంలో చాలా సందేహాలు ఉంటాయి. అలాంటివి ఈ కాలంలో యూట్యూబ్ లేదా బ్లాగుల ద్వారా ఇంటర్నెట్ సెర్చ్ చేసి విషయజ్ఙానం పెంచుకోవచ్చును.

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించడం ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని వీలైనంతగా ఇంటికే పరిమితం కావడం నేటి సామాజిక ఆవశ్యకత. ఇది అందరి బాధ్యతగా ఉంటుంది. అందరం ఇందులో భాగం కావాలి.

ప్రతిరోజూ వారంతమే అనుకుని ఇంకా రెండు వారాలు గడిపితే మనకు మాములు రోజులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పటికే వారం గడిచింది మరొక పద్నాలుగు రోజులు అందరూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తే పరిపోతుంది.

ప్రపంచం మొత్తం కరోనా(కొవిడ్-19) ఎదుర్కొవడానికి పోరాటం చేస్తుంది. మనదేశంలో సరైన సమయంలోనే లాకడ్ డౌన్ విధించారనే అంటున్నారు. అయితే ఈ లాక్ డౌన్ మనం అంతా కలిసి విజయవంతం చేయాలి. అప్పుడే కరోనా మహమ్మారిపై మనకు విజయం దక్కుతుంది.

కనబడని శత్రువుపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ విజయవంతం అవుతుంది. ప్రజలను మోటివేట్ చేస్తున్న మీడియ శ్రమ ఫలిస్తుంది. ఇలా కరోనా కట్టడికి ప్రయత్నం చేస్తున్న అన్ని రంగాలవారి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు…..

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.