కరోనా కరోనా కలవరమాయే కరోనాతో

కరోనా కరోనా కలవరమాయే కరోనాతో మంది మనసు కలత చెందుతుంది. కారణం కరోనా వ్యాధికి మందు లేకపోవడమే. ఇంకా మందు కనుగనబడని కరోనా వైరస్ కంటికి కనబడదు.

కంటికి కనబడకుండా కరోనా వైరస్ మందిమదిని కలవరపెడుతుంది. మీడియా మొత్తం కరోనా న్యూస్ ప్రసారం. ఎక్కడ చూసినా నిర్మానుష్యం, టివిల ముందు మనుజులు, టివిలలో కరోనా మాటలు, కరోనా పాటలు…

టివీలకే పరిమితం కావాల్సిన సమయం, ఇంట్లోనే ఉండి టివి చూడడం తప్ప ఇంకేమి లేదన్నట్టుగా మీడియా ప్రచారం. ఈ ప్రచారంలో వాస్తవమే ఉంది. కారణం కరోనా అంటువ్యాధి. కాబట్టి ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశం అధికం.

ఒకరి నుండి ఒకరికి, ఆ ఒకరి నుండి మరొకరికి, ఆ మరొకరి నుండి వస్తువుకు, ఆ వస్తువు నుండి వేరొకరికి, ఆ వేరొకరి నుండి మరొక వస్తువుకు, ఆ మరొక వస్తువు నుండి ఇంకొకరికి… ఇలా మనుషుల నుండి మనుషులకు, మనుషుల నుండి వస్తువులకు ఆ వస్తువులను ముట్టుకున్న మనషుల నుండి మరొకరికి లేదా మరొక మనిషికి కరోనా వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువ.

కాబట్టి ఖచ్చితంగా మీడియా ప్రచారంలో వాస్తవం ఉంది. ఇంటికే పరిమితం కావాలి. రోడ్లు నిర్మానుష్యంగానే ఉండాలి. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తికి కరోనా వస్తే వారి నుండి రకరకాలుగా, పలు వస్తువుల ద్వారా ఎలాగైనా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీ ప్రదేశంలో మీ ద్వారా మీరు కరోనా వ్యాప్తికి సహకరించకండి. అనే వాస్తవ వార్తలను జనం పట్టించుకోవాలి.

ఇక అది వార్త కాదు. కేంద్రప్రభుత్వం ఆదేశం. లాక్ డౌన్ కాబట్టి అంతా ఇంటికే పరిమితం కావాలి. రాష్ట్రప్రభుత్వాల సూచనలు తప్పక పాటించాలి. కరోనా కరోనా కలవరపాటుకు గురిచేస్తున్న కరోనాను కట్టడి చేయాల్సిందే.

కరోనా వ్యాధి కంటికి కనబడదు. ఈ కోవిడ్-19 వైరస్ కంటికి కనబడకుండా చైన్ లింకు ఏర్పరచుకుంటూ పోతుంది. దానికి మందులేదు… అది వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడమే అని ప్రపంచం మొత్తం మొత్తుకుంటుంది. మీడియా కోడై కూస్తుంది.

కరోనా కరోనా కలవరమాయే కరోనాతో
కరోనా కరోనా కలవరమాయే కరోనాతో

కోవిడ్-19 వైరప్ పై పోరాటమే చేయాలిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అంతర్జాతీయ విపత్తుగా పరిగణిస్తున్న ఈ కరోనా కల్లోలం అంతటా వ్యాపిస్తుంది. అది వ్యాపించకుండా ఉండాలంటే, ఎవరికివారే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కరోనా కలవరపాటును దాని కల్లోలం తగ్గించడానికి తగు జాగ్రత్తలు ఎవరికివారు తీసుకోవాలి.

కరోనా కరోనా కలవరపాటును సంకల్పంతో తరిమేయాలి

ఈ కరోనాపై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీగారు మరొక పిలుపునిచ్చారు. గతంలో జనతా కర్ప్యూకు పిలుపినిస్తే, దేశ ప్రజలంతా కలిసి అది విజయవంతం చేశారు. అలాగే ఇప్పుడు ఈ ఆదివారం రాత్రి 9గంటలకు కరెంటు లైట్లు ఆపేసి, కొవ్వొత్తి దీపాలను వెలిగించాలని దేశప్రజలకు పిలుపు అందించారు.

కరోనా కరోనా కలవరపాటును సంకల్పంతో తరిమేయాలి

ఒక మనిషి పదే పదే తలచిన పనిని కొన్నాళ్ళకు సాధించగలడు. ఒక వ్యక్తి నేను సాధించాలి, సాధించాలి అనే పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. అంటే అది అతని సంకల్ప బలంగా చెబుతారు. అటువంటిది అంతా ఒక బలమైన సంకల్పం చేస్తే, ప్రకృతి ఆ సంకల్ప శక్తికి బలాన్నిస్తుంది అంటారు.

ఇప్పుడు నరేంద్రమోదీగారు ఇచ్చిన పిలుపు అదే అంతా కరోనాకు వ్యతిరేకంగా బలమైన సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. అంతా కలిసి సంకటితంగా బలమైన సంకల్పం చేయడానికి సంకేతంగా ఈ ఆదివారం రాత్రి 9గంటలకు 9నిమిషాలపాటు కొవ్వొత్తి దీపాలు వెలిగించాలి.

కరోనా కరోనా కలవరపాటును సంకల్పంతో తరిమేయాలి
కరోనా కరోనా కలవరపాటును సంకల్పంతో తరిమేయాలి

130 కోట్లమంది భారతీయుల సంకల్పం కరోనా మహమ్మారిని తరిమికొట్టడమే అయితే, అది భారతదేశం కాదు… ప్రపంచం వదిలిపోతుంది. అద్భుతాలు భారత్ లోనే సాధ్యం అంటారు. భారతీయుల సంకల్పం గట్టిది కాబట్టి కరోనా రావాడానికి టైం ఎక్కువ తీసుకుంది. ఇప్పుడు భారతీయులు కరోనాకు వ్యతిరేకంగా సంకల్పం చేసుకుంటే, పోవడానికి ఎక్కువ టైం పట్టదు.

ఒకరి సంకల్పం చేతనే దేవుడినే క్రిందికి దింపిన ఘనచరిత్ర మనకు ఉంది. భగీరధుడి సంకల్పంతో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. గంగ కిందికి దిగింది. సాక్ష్యాత్యు పరమశివుడు గంగను పట్టాడు. ఒక భగీరధుని ప్రయత్నం ఫలితంగా వేల సంవత్సరాలుగా గంగానది భారతదేశంలో ప్రవహిస్తుంది.

అటువంటిది దేశమంతా భగీరధ సంకల్పం చేస్తే, కరోనా దేశదిక్కులు దాటి పారిపోతుంది. ఇప్పుడు దేశమంతా ఒకే భావన బలంగా రావాలి. కరోనా పోవాలి. అందుకు చేయాల్సింది కంటికి కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్న వైద్యులకు, పోలీసు వ్యవస్థకు ప్రజలనుండి సంఘీభావన. తమ వెనుక 130 కోట్లమంది మద్దతు ఉంది అనే బలమైన భావన.

ఇంటికే పరిమితం అవుతూ చాలామంది లాక్ డౌన్లో సహకరిస్తున్నారు. కొంతమంది తప్పని స్థితిలో బయటకు వెళ్తుంటే, కొంతమంది తెలిసీ తెలియక బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు మరొకసారి ప్రధాని నరేంద్రమోదీగారు ఇచ్చిన పిలుపును పాటిస్తే, దేశమంతా ఏకమనే భావన ప్రతి వ్యక్తిలోనూ పెరుగుతుంది.

ఒంటరిగా ఫీల్ అవుతున్న వ్యక్తికి నేనున్నాను అనే మిత్రుడి పిలుపు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అదే ఇప్పుడు దేశానికి ప్రజలంతా ఒకే భావన, ఒకే సంకల్పం అనే సంఘీభావం ప్రకటితమైతే, అది దేశానికే గర్వకారణం. సమాజంలో ఒక కుటుంబంలోని సభ్యులంతా ఒకే మాటపై ఉంటే, ఆ సమాజంలో ఆ కుటుంబానికి విలువ ఎక్కువ. అలాగే ఒక దేశ ప్రజలంతా సమైక్యభావన బౌతికంగా ప్రకటితమైతే, ఆభావన బలం ప్రపంచానికి బలం అవుతుంది.

ఇప్పుడు మన భారతీయుల సంకల్పశక్తి ప్రపంచానికి మార్గదర్శకం అవుతుంది. 130కోట్లమంది ఆదివారం 9గంటలకు 9నిమిషాలపాటు కొవ్వొత్తి దీపాలు వెలిగిద్దాం. ప్రధాని పిలుపును విజయవంతం చేద్దాం…

కరోనా కరోనా కలవరపాటును తరిమేయాలి. కరోనాను కట్టడి చేయడానికి ఎవరింట్లోవారే ఉంటూ, సామాజిక దూరం పాటించాలి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంది మనకు మాత్రం ప్రభుత్వాల జాగ్రత్తల వలన ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం మనం ఇంకా రక్షణలో ఉన్నట్టే. కానీ అజాగ్రత్త నిర్లక్ష్యం వలన ఇటలీలో లక్షకు పైగా కరోనా వైరస్ బారీన పడ్డారు. వేలల్లో మరణాలు సంభవించాయి. అమెరికా అయితే అగ్రస్థానంలో కరోనా కేసలు నమోదు చేసుకుంది. పరాకుగా లేకపోతే మన స్థితిని మనం ఊహించలేం… రక్షణ జోన్లో ఉన్న వ్యక్తిగతంగా మన జాగ్రత్త మనకుండాలి…. మన జాగ్రత్త మనకు రక్షణ, అదే మనకుంటుంబానికి శ్రీరామరక్ష. మన ద్వారా మనకుటుంబం సేఫ్, తద్వారా సమాజం సేఫ్…. ఇది అంతా గమనించాలి.

ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.