కరోనా కాటు కంట్రీలలో కలవరం

కరోనా కాటు కంట్రీలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. రికవరీలు కొన్ని కంట్రీలలో బాగుంటే, కొన్ని కంట్రీలలో వ్యాప్తి ఉంటుంది. ఏదైనా కరోనా కాటు కంట్రీల పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

పది లక్షలు అంకె డబ్బుకు సంబంధించి కాదు, ఒక ప్రాంత జనాభాకు సంబంధించి కాదు, కరోనా సోకినవారి సంఖ్య. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ సోకినవారి సంఖ్య పదిలక్షలు దాటింది. మరణాల సంఖ్య 58 వేలు దాటింది.

కరోనా కాటు కంట్రీల వివరాలు కొన్ని

అమెరికాకు కరోనా కాటు ఫలితం పెరుగుతుంది. కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికి 275,357 కోవిడ్-19 వైరస్ బాధితులుగా నమోదైతే, మరణాలు 7,067 గా వికి సమాచారం ఉంది. 12,268 రికవరి అయ్యినట్టుగా సమాచారం. కానీ కరోనా వైరస్ భారిన పడ్డ బాధితులు అమెరికాలోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. పదమూడు వేలకు పైగా కరోనా మరణాలు ఉన్న ఇటలీ కన్నా అమెరికాలోనే కోవిడ్-19 కరోనా వైరస్ సోకినవారుఎక్కువ. అత్యధికంగా కరోనా కేసులు నమోదు అమెరికాలోనే ఉన్నాయి.

కరోనా కాటు కంట్రీల వివరాలు కొన్ని
కరోనా కాటు కంట్రీల వివరాలు కొన్ని

కరోనా వైరస్ అమెరికాలో 20-03-2020 నాటికి 17,439 మందికి ఉంటే, నేటికి 275,357 మందికి కరోనా సోకినట్టుగా ఉంది. జాగ్రత్త లేకపోతే అంటువ్యాధి అంటుకోవడానికి చాలా తక్కువ సమయం చాలు అని అమెరికా కరోనా కేసులు గమనిస్తే అర్ధం అవుతుంది. అమెరికాలో కరోనా పాజిటివ్ కొత్త కేసులు రోజుకు 20 – 25వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉంటే, ఇప్పుడు 30వేలు దాటింది. కరోనా కాటు కంట్రీలలో కలవరపడుతున్న అమెరికా టాప్ లో ఉంది.

ఆ తరువాత ఇటలీ ఉంది. కానీ మరణాల సంఖ్యమాత్రం ఇటలీనే ఎక్కువ. ఇటలీలో కోవిడ్-19 వైరస్ సోకినవారు 119,827 అయితే 14,681 మరణాలు ఉన్నాయి. 19,758 మంది రికవరి అయినట్టు వికి సమాచారం. ఇటలీలో కరోనా వ్యాప్తి అమెరికాతో పోల్చుకుంటే తక్కువగానే ఉంది. కానీ కరోనా కాటుకు బలైన జాబితా ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వలన 19,758 మరణాలు సంభవించాయి. ఇటలీలో రోజువారి కరోనా కేసులు 4.5వేలకు పైగా నమోదు అవుతున్నట్టుగా ఉంది. కరోనా కాటు కంట్రీల ఇటలీ రెండవ స్థానంలో ఉంది.

స్పైయిన్ దేశంలో కరోనా కేసులు లక్షకు పైగా నమోదు అయ్యాయి. మరణాలు పదివేలు దాటాయి. స్పైయిన్ ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నమోదులో మూడవస్థానంలో, మరణాల రేటులో రెండవ స్థానంలో ఉంది. స్పైయిన్ లో కరోనా కొత్త కేసులు రోజుకు 7వేలకు పైగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా కరోనా కాటు ఘాటుగా తాకింది. ఇక్కడ 119,199 కోవిడ్-19 కేసలు నమోదు అయితే, 11,198 మరణాలు నమోదు అయ్యాయి. ఇక్కడ రికవరీ అయిన కేసుల సంఖ్య 26,743.

కరోనా కాటు బాగా బలంగా తాకుతున్న మరొకదేశం జర్మనీ. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నాల్గవదేశంగా జర్మనీ వికి లెక్కలప్రకారం కనబడుతుంది. జర్మనీలో కోవిడ్-19 వైరస్ సోకినవారు 91,959 మంది ఉన్నారు. అయితే మేలైన విషయం మరణాల సంఖ్య 1,275 తక్కువగా ఉంది. రోజూవారి కరోనా కొత్త కేసులు 6వేలకు పైగా ఉంటుంది. 13,597 మంది రికవరి అయ్యారు. జర్మనీలో కరోనాసోకినవారి మరణాలు పెరిగాయి, వ్యాధినుండి రికవరీ అయినవారు పెరకపోవడం ఆందోళన కలిగించే అంశం. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయినా మరణాల సంఖ్య తక్కువగా ఉండి రికవరి కూడా బాగానే ఉండడం మేలైన విషయం.

కరోనా కేసు మొదటిగా నమోదు అయ్యి వేలల్లోకి పాకిన కరోనా కేసులకు మూలం చైనా అంటారు. చైనాలో కరోనాకేసులు 81,620 కాగా 3,322 మరణాలు కాగా 76,571 మంది రికవరి అవ్వడం విశేషంగా స్టాటిస్టిక్స్ కనబడుతున్నాయి. చైనా లెక్కలు వికిపీడియాలో అలా కనబడుతూ కరోనా కట్టడి విషయంలో ఆదర్శంగా చైనా కరోనా స్టాటిస్టిక్స్ కనబడుతుండడం విశేషం. తొలికాటుకు పవర్ ఎక్కువ. అయితే కరోనా తొలికాటు ప్రభావం కన్నా మలికాటు ప్రభావం మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించడం విశేషం. ఇక ఈ కరోనా స్టాటిస్టిక్స్ లో చైనా అయిదవ స్థానంలో కనబడుతుంది. పొయ్యి కూడా పొగసెగ ఉండదు, పొయ్యికి దూరం పొగ ప్రభావం కనబడుతుంది అన్నట్టుగా చైనా పరిస్థితి ఉంది. ఇక్కడే ప్రారంభం అయిన కరోనా కల్లోలం, దాని ప్రభావం ఇక్కడి నుండి బయటికి బలంగా తాకింది.

కోవిడ్-19 వైరస్ కాటు ప్రభావం బలంగా కనబడుతున్న మరొక దేశం ఫ్రాన్స్. ఈ దేశంలో 63,643 కరోనా కేసులు నమోదు కాగా 6,496 మరణాలు సంభవించాయి. 14,008 రికవరీ అయ్యారు. ఇక్కడ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి రోజుకు 3వేల వరకు ఉంటే, ఇప్పుడు అది అయిదువేలు దాటింది. ఇక్కడ మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఫ్రాన్స్ దేశంలో కరోనా కేసులలో సుమారు 9.2% మరణాలు ఉండడగా ఇంకా 1% పెరిగి 10.2% వరకు పెరగడం ఆందోళన కలిగించే విషయం.

తరువాత ఇరాన్ దేశంలో కరోనా కేసులు 53,183 మందికి ఉంటే, 3,294 మంది మరణించినట్టుగా ఉంది. 17,935 మంది రికవరి అయ్యారు. ఇక్కడ కరోనా కేసులు పెరుగుదల రోజుకు 2.7వేలకు పైగా ఉండడం ఆందోళనకరం. నమోదు అవుతున్న కరోనా కేసులలో మరణాల రేటు సుమారు 6.2% గా ఉంది.

మరొక దేశం యునైటెడ్ కింగ్ డమ్ 38,868 కరోనా కేసులు నమోదు అయితే వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజువారి నమోదు అవుతున్న కొత్త కేసులు 4వేలకు పైగా ఉండగా ఇప్పుడు అది 5వేలకు పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఇంకా కరోనా నుండి విముక్తి పొందినవారు బహుతక్కువగా ఉంది. కేవలం 208 మంది రికవరి అయ్యారు. ఇది ఇక్కడ ఆందోళన కలిగించే అంశమే.. కేసులు రోజుకు పెరుగుతున్నాయి. రికవరీ తక్కువగా ఉంది. నమోదు అయిన కరోనా కేసులలో మరణాల శాతం 9.3% గా ఉంది. ఇప్పటికీ 3,611మంది కరోనా వైరస్ వలన మృత్యవాత పడ్డారు.

టర్కీలో 18,135 కరోనా కేసులు నమోదు కాగా, 425మంది కరోనా భారిన పడి మరణించారు. 484 కేసులు రికవరీ అయ్యినట్టుగా వికి సమాచారం. టర్కీలో కరోనా కొత్త కేసులు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. రోజుకు 2.5 – 3వేల వరకు ఉంటున్నాయి. కరోనా పాజిటివ్ కేసులలో టర్కీ స్విట్జర్లాండును దాటేసింది.

స్విట్జర్లాండులో 19,702 కరోనా కేసులు నమోదు కాగా, 604మంది కరోనా భారిన పడి మరణించారు. 5,657 కేసులు రికవరీ అయ్యినట్టుగా వికి సమాచారం. స్విట్జర్లాండులో రోజుకు వేయికి పైగా ఉండగా ఇప్పుడు 879 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

బెల్జియంలో 16,770 కరోనా కేసులు నమోదు కాగా, 1,143 మంది కరోనా భారిన పడి మరణించారు. 2,872 కేసులు రికవరీ అయ్యినట్టుగా వికి సమాచారం. ఇక్కడ కూడా కరోనా కొత్త కేసులు రోజుకు వేయికి పైగా ఉండగా ఇప్పుడు 14వందలకు పైగా కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

నెదర్లాండ్స్ లో 15,723 కరోనా కేసులు నమోదు కాగా, 1,487 మంది కరోనా భారిన పడి మరణించినట్టుగా వికి సమాచారం. ఇక్కడ కూడా కరోనా కొత్త కేసులు రోజుకు వేయికి పైగా నమోదు అవుతున్నాయి. కానీ నెదర్లాండ్లో కరోనా కేసలు రికవరీ అయిన కేసులు కనబడడం లేదు.

కెనడాకు కరోనా కాటు ప్రభావం ఇలా కెనాడాలో 12,374 కరోనా కేసులు నమోదు కాగా, 178 మంది కరోనా భారిన పడి మరణించారు. 2,190 కేసులు రికవరీ అయ్యినట్టుగా వికి సమాచారం. ఇక్కడ కూడా కరోనా కొత్త కేసులు రోజుకు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

ఇండియాలో కరోనా వ్యాప్తి మెల్ల మెల్లగా పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. గతంలో 2069 కరోనా పాజిటివ్ కేసులైతే, ఇప్పుడు ఈ పోస్టు అప్డేట్ సమయం ఉదయం 5గంటలకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2547 పెరగగా 62మంది మృత్యవాత పడ్డారు. 163గురు రికవరీ అయ్యారు.

గమనిక

కరోనా కాటు కంట్రీల ఈ వివరాలు వికీపీడియా నుండి ఈ సమయానికి 30 నిమిషాల క్రితం వరకు ఉన్న స్టాటిస్టిక్స్….

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.