stop corona కరోనా ఆగు అంటూ ఆదివారం ఆగిపో అంటూ

stop corona కరోనా ఆగు అంటూ ఆదివారం ఆగిపో అంటూ రాత్రి 9గంటలకు 9 నిమిషాలపాటు దీపం వెలిగిద్దాం… మంచి సంకల్పం చేసి, కరోనా కట్టడి మానసిక సంకల్పం మనస్ఫూర్తిగా చేద్దాం…

stop corona కరోనా ఆగు అంటూ ఈ పోస్టు మీరు ఎక్కడ చదువుతున్నారు? ఇంట్లోనే అయితే కంటిన్యూ చేయండి. లేకపోతే ఈ పోస్టు చదవడం stop చేసి corona కరోనా కట్టడి కోసం ఇంటికి చేరండి. మన పనులు ఆగకూడదు. అంటువ్యాధి అంటకూడదు అంటే అది పెనుముప్పుకు దారి తీస్తుంది.

కరోనా న్యూస్ – కంటికి కనబడని కరోనా మహమ్మారి కోవిడ్-19 మానవాళితో మాయయుద్ధం చేస్తుంది. సమాజం తరపున వైద్యులు, పోలీసులు పోరాడుతున్నారు.

కరోనా వైరస్ సోకినవారికి వైద్యులు వైద్యం చేస్తున్నారు. వైద్యవృత్తిలో ఉండేవారు వైద్యం చేయడం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ప్రాణాలు రిస్కులో పెట్టి వైద్యం చేయడం అంటే ఖచ్చితంగా సైనిక సాహసమే. కరోనా పాజిటివ్ ఉన్నవారి వైద్యం చేస్తున్న వైద్యులకు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా సోకే అవకాశం ఉంటుంది.

కానీ వైద్యవృత్తిలో ఉండి తమ కర్తవ్యం తాము నిర్వహించడంలో వైద్యులు సాహసం చేస్తున్నారు. కనబడని శత్రువుని వెంటబెట్టుకుని హాస్సటల్స్ కు వస్తున్న కరోనా రోగులకు డాక్టర్స్ వైద్యం చేస్తున్నారు. సమాజాన్ని సేవ్ చేయడానికి వారు చేయవలసిన పనిని వారు సాహసంతో చేస్తున్నారు.

ఇక పోలీసులు కాపు కాస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై వచ్చేవారికి కరోనా ఉండవచ్చును, ఉండకపోవచ్చును. కానీ వారు కూడా కరోనాకు వ్యతిరేకంగా కృషి చేస్తున్నారు.

ఇలా అందరూ stop corona కరోనా ఆగు అంటూ

పోలీసులు, వైద్యులు ఇలా కరోనా కట్టడికి కృషి చేస్తుంటే, ఇంట్లో కూర్చునేవారికి కరోనా అప్డేట్స్ అందించడంలో మీడియా కూడా తమవంతు పాత్రను పోషిస్తుంది. మీడియా రిపోర్టర్లు ఎండలో తిరుగుతూ న్యూస్ కవర్ చేస్తూ కరోనా గురించి అప్డేట్ అందిస్తున్నారు. ఇలా అందరూ stop corona కరోనా ఆగు అని పని చేస్తుంటే సామాన్యులు చేయాల్సింది?

ఈ విధంగా ఒక వ్యక్తి ఇంట్లో కూర్చుంటే, అతనికి ఎదురుగా టివిలో కరోనా గురించిన న్యూస్ కనబడుతుంది. ఇతర పరికరాలు వాడితే వాటిలో కూడా కనబడుతుంది. అయితే సామాన్యుడు ఏంచేయాలి. కరోనా కట్టడికి అధికార యంత్రాంగం పని చేస్తుంటే, ప్రజలు చేయవలసినది ప్రభుత్వానికి సహకరించడం.

stop corona కరోనా ఆగు అంటూ ఆదివారం ఆగిపో అంటూ
stop corona కరోనా ఆగు అంటూ ఆదివారం ఆగిపో అంటూ

ప్రభుత్వం సూచించిన లాక్ డౌన్ సూచనలు తుచ తప్పకుండా పాటించడమే ప్రతివారు చేయాల్సిన ముఖ్యమైన పని. కరోనా ఒక చైన్ లింకులాగా పాకుతుంది కాబట్టి అటువంటి లింకుకు ఏ ఒక్కరు అందుబాటులో ఉండకుండా ఇంటికే పరిమితం కావడం చాలా చాలా ప్రధానమైన విషయం.

ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారు దీపం వెలిగించి సంకల్పం చేయండి. మీలో జ్ఙాన జ్యోతులు వెలిగించండి. సంకల్పం చేయండి. వైద్యం చేస్తున్న వైద్యులను కరోనా భారిన పడకుండా మనల్ని రక్షించడానికి కరోనా నుండి రక్షణ వారిన రక్షించమని సంకల్పం చేయండి. మనస్ఫూర్తిగా సత్ సంకల్పం చేస్తే ప్రకృతి ఆ సంకల్పానికి బలం చేకూరుస్తుందని అంటారు.

వ్యక్తి తనకోసం సంకల్పం చేసుకుంటే స్వార్ధం. తనకోసం తనతోటివారి కోసం సంకల్పం చేసుకుంటే, అది అందరూ హర్షిస్తారు. అదే తన కోసం తన కుటుంబం కోసం తనుండే సమాజం కోసం సంకల్పం చేస్తే అది ప్రకృతి కూడా పలుకుతుందంటారు. అలా సమాజాన్ని కూడా కలుపుకుని బాగుకోసం సంకల్పం చేస్తే అది సత్సంకల్పం.

సత్సంకల్పం చేయడమే భారతీయ సంప్రదాయంలో దైవప్రార్ధన. కాబట్టి అటువంటి సంకల్పం ఇప్పుడు చేయండి. మన మనసులో సమాజం బాగుండాలి. మన సమాజంలో నుండి కరోనా వెళ్ళిపోవాలి. stop corona కరోనా ఆగు అని అనుకుంటాం. అయితే ఆ సంకల్పం నలుగురికి తెలిస్తే అయిదోవాడు మరింత బలంగా రెస్పాన్స్ అవుతాడు. కాబట్టి అంతా ఆదివారం stop corona కరోనా ఆగు అంటూ దీపంతో సంఘీభావం తెలియజేయాలి.

130 కోట్ల మంది భారతీయులు ఉన్న భారతదేశంలో అన్ని ఇళ్ళల్లోనూ దీపాలు వెలిగితే, ఆ కాంతి అందరి మనసులో ఆలోచన కలిగిస్తుంది. ఆ దీపం వెలిగించిన కారణం మనసుకు మరింతగా చేరుతుంది. ఆప్పుడు మనసులో ఇప్పుడున్న కష్టం పోవాలనే భావన మరింత బలపడుతుంది.

మనసులో అనుకుంటే కరోనా ఆగుతుందా అంటే, కరోనా ఆగాలనే తలంపుతో ఇంట్లో కూర్చుంటే చాలు మీద్వారా మీరు ఆపినట్టే. ఇక మీరు ఆప్రయత్నం చేస్తున్నట్టుగా దీపంతో మీరు సంఘీభావం ప్రకటిస్తే పట్టించుకోకుండా తిరిగేవారిలో కూడా ఆలోచన వస్తుంది. మీద్వారా మీ చుట్టుప్రక్కల ఉండేవారిలో ఒకరు ఇంటికే పరిమితం అయినా చాలు. stop corona కరోనా ఆగు అంటూ ఆదివారం ఆగిపో అంటూ సంకల్పం చేద్దాం.

మనం ఒక్కరం ఇంట్లో ఉంటే పోయేదేమిటి? మనకు కరోనా లేదు. మనం తిరిగితే పోయేదేముంది? ఈ ప్రశ్నలు వేసుకుని తిరిగేవారి వలన వారిని చూసి మరి కొంతమంది తిరుగుతారు. ఆ మరికొంతమందిలో కరోనా వ్యాధి సోకి ఉండి ఉంటే మాత్రం.. మీరు ఆ కరోనా వ్యాప్తికి సహకరించిన వారు అవుతారు. కాబట్టి కరోనా కాలంలో ఇంటికే పరిమితం అవుతూ, ప్రధాని పిలుపు మేరకు ఆదివారం stop corona కరోనా ఆగు అంటూ దీపం పెడదాం… భారతీయుల సంకల్ప శక్తిని చాటుదాం.

కరోనా కరోనా రోజు రోజుకు సంఖ్యల్లో కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. ఏదో సహజ మరణాలు కాదు. అంటువ్యాధి అంటుకుని బాధతో వైద్యం అందకో, అందినా నయం కాకో కరోనా వ్యాధిగ్రస్తులు మరణిస్తున్నారు. దీని పాపం మోసుకొచ్చినవాడికి ఉంటుంది.

ఇప్పుడు కరోనా వైరస్ ఎవరి వలన వ్యాప్తి చెందుతుంది అని కాదు. దానిని వ్యాప్తిని అడ్డుకోవడం గురించే… దానికోసం ప్రపంచంలో పలుదేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఆర్ధిక నష్టం విపరీతంగా ఉంటుంది అయినా ప్రజలు ప్రాణాలే ముఖ్యం. దేశంలో ప్రజలు లేకుండా మిగిలినవి ఉండి ఏం ప్రయోజం కాబట్టి stop corona కరోనా ఆగు అటూ లాక్ డౌన్ సాగుతుంది.

మనస్ఫూర్తిగా పిలిస్తే నేనే వస్తా అని గీతలో భగవానుడు చెప్పాడు. మనసులేకుండా బంగారం సింహాసనంపై భగవానుని ప్రతిమను పూజించినా ప్రయోజనం ఉండదని ప్రవచనకారులు అంటారు. అంటే మనస్ఫూర్తిగా పిలిస్తే దైవం పలుకుతుంది కదా… మనం మనతోటివారితో కూడిన సమాజం కోసం మనం మనస్ఫూర్తిగా సంకల్పం చేయడం ఏమంతా అసాధ్యం కాదు.

మనసులో మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం కదా మరలా ఈ దీపం పెట్టడం అనే ఆలోచన వద్దు. మనం చేస్తున్న సంకల్పం అందరితో కూడి ఏకాకాలంలో చేస్తే అది శక్తివంతం అవుతుంది. ఒకరు చేసే సత్సంకల్పం కోరికను సిద్దింపజేస్తే, అంతా కలిసి ఏకకాలంలో చేసే సంకల్పం సమాజసిద్దికి ఉపయోగం అవుతంది.

మనం చేసే ప్రయత్నం బయటికి కనబడితే అది మరొకరికి స్ఫూర్తినిస్తుంది. సమాజం శ్రేయస్సుకోసం మరొకరిలో స్ఫూర్తికోసం ఎవరైనా మంచి పనికి పిలుపు ఇస్తే చేయాలి. ఇక దేశప్రధానే పిలుపినిస్తే ఖచ్చితంగా చేయాలి. అది మన సామాజిక బాధ్యత. రాజకీయ విశ్లేషకులు కూడా ఆ పిలుపు ఆహ్వానిస్తున్నారు.

దీపం వెలిగించి దేశ ప్రజలంతా చేసే సంకల్పంలో నేను ఒక్కడినే చేయకపోతే ఏమౌతుందిలే, అందరూ చేస్తారు కదా అని అలసత్వం వహించవద్దు. మీరు చేస్తుంటే మిమ్మల్ని చూసి మరొకరు కూడా చేయాలని చూస్తారు.

సమాజంలో మంచి పనిని నలుగురిని చూసి ఒకరు మొదలుపెడితే, ఆగిపోవడానికి మాత్రం ఒకరిని చూసి నలుగురు ఆగుతారు. అంత చిత్రంగా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీవంతు ప్రయత్నం మీరు stop corona కరోనా ఆగు అంటూ ఆదివారం నాడు 9గంటలకు 9 నిమిషాలపాటు దీపం వెలిగించండి. సంకల్పం మనస్ఫూర్తిగా చేయండి. మనసుపెడితే అనారోగ్యవంతుడు ఆరోగ్యవంతుడుగా ఉత్సాహం పొందగలడని వైద్యులు అంటారు. మనసు పెడితే దేవుడు దిగి వస్తాడు అని పెద్దలు అంటారు. మనసు పెడితే నీవు అనుకున్నది సాధిస్తావు అని టీచర్లు చెబుతారు. ఇప్పుడే దేశ ప్రధాని చెబుతున్నారు మనసు పెట్టి మన కోసం మనం చుట్టూ ఉండే సమాజం కోసం మంచి సంకల్పం చేయమని…

కరోనా కట్టడికి అధికార యంత్రాంగం, వైద్యరంగం పోరాడుతుంటే మనం మన ఇంటి ముందు దీపం పెట్టి సంకల్పం చేద్దాం… ప్రధాని పిలుపుని విజయవంతం చేద్దాం… stop corona కరోనా ఆగు అంటూ ఆదివారం ఆగిపో అంటూ ఆగు అని ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల కాలంపాటు దీపం వెలిగించి సంకల్పం చేద్దాం….

నానాన్యూప్…

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.