maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే…

maybe corona hugged at anywhere in outside. బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే… ఎందుకంటే కరోనా ఎక్కడ అంటి ఉందో ఎవరికెరుక?

బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే అవుతుంది. కారణం కరోనా పెరుగుతుంది. ఇప్పుడు అది ఎక్కడ ఉంది అంటే కంటికి కనబడదు. బయటకుపోయి ఎక్కడైనా చేయి వేయకుండా ఉండగలమా అంటే అంత గమనిస్తూ చేతులు ఉపయోగించేవారు అందరూ ఉండకపోవచ్చును.

maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే...
maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే…

కొందరు చేతులు అక్కడ ఇక్కడ ముట్టుకోవడం అలవాటు అయి ఉంటే వారు అలానే ప్రవర్తిస్తారు. అలవాటు అంత తొందరగా పోదు. కాబట్టి ఇలాంటివారికే కరోనా సోకి ఉంటే, వారు ముట్టుకున్న ప్రతి వస్తువుకు కొంతకాలం కరోనా పట్టి ఉంటుందని వైద్యులు అంటున్నారు.

ఎక్కడికీ వెళ్ళకుండా ఉంటే, కరోనా సోకకుండా ఉండే అవకాశం ఎక్కువ. ఎక్కడికైనా వెళితే కరోనా సోకే అవకాశం ఎక్కువ. కరోనా సోకితే అది సోకిన వ్యక్తికే పరిమితం కాదు. ఆవ్యక్తి ముట్టుకున్న వస్తువుపై కొంతకాలం ఉంటుంది. వ్యక్తి ముట్టుకున్న మరొక వ్యక్తిలోకి పోతుంది. అతని నుండి మరి కొన్ని వస్తువులకు, మరికొంతమందికి… ఇలా ఓ చైనులా పోతూనే ఉంటుంది. ఇంటికే పరిమితం, కరోనా వ్యాప్తికి అవరోధంగా మారడమే నేటి మానవతా చర్య.

maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే...
maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే…

maybe corona hugged at anywhere

ఒకవేళ మీరు బయటకుపోయి ఎక్కడైనా అవి ఇవి ఉన్న చోట అవి ఇవి పట్టుకుని జనం తిరిగే ప్రదేశాలలో తిరిగితే.. ఏదైనా వస్తువును తాకిన కరము కానీ ఏదైనా ప్రదేశాన్ని ముట్టుకున్న కరము కానీ… కరోనాతో కరచాలనం చేయవచ్చును. అంటే బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే అవుతుంది.

కరములు కంటిని తాకితే కరోనా సోకవచ్చును. కరములు ముక్కును తాకితే కరోనా సోకవచ్చును. కరములు నోటిని తాకితే కరోనా సోకవచ్చును. ఇంతకుముందు కరోనా కలిగిన కరములు తాకిన వస్తువులను, ప్రదేశాలను లేదా కరోనా కలిగిన వ్యక్తులతో కరచాలనం చేసి ఉంటే కరోనా వ్యాపిస్తుంది. ఒంట్లోకి కరోనా వ్యాపిస్తే, మీద్వారా కూడా కరోనా మరొక వస్తువుకు, మరొక ప్రదేశానికి మరొక మనిషికి వ్యాప్తి చెందవచ్చును. కాబట్టి కరముల నియంత్రణ ఉండాలి.

కరోనా సోకని కరములకు నమస్కారం. ప్రపంచంలో కరోనా భయం వలన కలిగి బలమైన భావన. మెచ్చితే కరచాలం చేసుకునేవారు కూడా కరోనా సోకని కరములకు మొక్కేకాలం ఇది.

ప్రార్ధన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. ఈ కరోనా కాలంలో సాయం అంటే, కరచాలనం చేయకుండా ఉండడం. నమస్కారం పెడుతూ కరోనా వ్యాపించకుండా కరోనా కట్టకడి సాయం చేసిన చేతులు కరములైతే ఆ కరములకు క్రింది విధంగా నమస్కారం.

maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే...
maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే…

కరోనా సోకని కరం దీనికో నమస్కారం

ఈ కరం పుణ్యకరం ఈ కరం కరోనా లేని కరం ఈకరం కరోనా అంటని కరం
కరోనా కట్టడి చేయని కరమెందుకు, కరోనా సోకినా కరమేలా బయటికి పోవలె
ఈ కరం పుణ్యకరం కరోనా సోకని కరం దీనికో నమస్కారం

ఇక మన తెలుగురాష్ట్రాలలో కరోనా ఏకరములు తీసుకువచ్చాయో తెలియదు కానీ కరోనా మాత్రం పెరుగుతంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ అంకెల నుండి సంఖ్యల్లోకి వెళ్ళింది.

ఏపిలో కరోనా కాటుకు మొదటి మరణం నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలోనే మరణించిన వ్యక్తి, కరోనాకాటుకే బలినైట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన న్యూస్ పబ్లిష్ అయ్యింది. మార్చి30న నమోదు అయిన వ్యక్తి మరణం, ఏప్రిల్ 3న కరోనా మరణంగా ప్రకటితం అయ్యింది.

మరణం ఎప్పుడు సంభవించినా కారణం మాత్రం కరోనాకాటువలననే… అయితే ధృవీకరణకు సమయం పట్టింది. ఆవ్యక్తికి అనారోగ్యం అధికంగా ఉండడం చేత కరోనా కాటు అని ఆలస్యంగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 132 కరోనా పాజటివ్ కేసులుంటే, ఒక కరోనా మరణం నమోదు అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ ప్రక్క తెలుగు రాష్ట్రంలో కరోనా మరణాలు 11కు చేరాయి. 229 మందికి ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా న్యూస్ అయితే మరో వేయిమందికి పరీక్షలు చేయనున్నట్టుగా సమచారం. ఇంకా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఎక్కువ.

కంటికి కనబడని కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా రోజూ వేలమందికి సోకుతుంది, వందలమంది రోజూ మరణిస్తున్నారు. మనదేశంలో కరోనా ప్రభావం ప్రపంచదేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే దేశంలో కరోనా ప్రభావం పెరుగుతూ కనబడుతుంది.

కరోనాతో కరచాలనం మనకేలా

కరోనా పెరగకుండా ఉండడానికి తీసుకోవాలసిన జాగ్రత్తలలో పదే పదే ప్రభుత్వాధికారులు, ప్రముఖులు అంతా చెబుతున్నది ఒక్కటే… ఇంట్లోనే ఉండండి… సామాజిక దూరంతో మెసలండి. గుంపులోకి వద్దు, గుంపును పోగేయవద్దు… అని. చేతులు కడుక్కోవడం, చేతులు కంటికి, ముక్కుకి, నోట్లోకి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టవద్దు.. నోటిని అదుపులో పెట్టుకోవడం కాదు చేతులు అదుపులో పెట్టుకోమని చెబుతున్నారు.

ఇంటికే పరిమితం అయితే కరోనా కట్టడికి సాయం చేసినట్టే… ప్రార్ధన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న… ప్రాణం పోతే తీసుకురాలేం. ఆరోగ్యం పోతే మనిషికి సంతోషం ఉండదు. సంతోషం లేని జీవితం మరొకరి సంతోషకరమైన జీవితాన్ని ఇబ్బందిపాలు చేసే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం కావాల్సిన కాలంలో బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే అవుతుంది.

కరోనాతో కరచాలనం మనకేలా,

కరోనా వచ్చిందేమోననే దిగులేలా,

కరోనా సోకడానికి కారకం కావడమేలా,

కరములు కట్టుకుని ఇంట్లోనే ఉంటే,

ప్రాణం హాయి, కరోనా కట్టడికి సహకారిగా ఉంటే పోలా…

maybe corona hugged  బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే...
maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే…

కరోనా కట్టడికి కరములను ఉపయోగిస్తే, ప్రార్ధన చేసే పెదవులు కన్నా మిన్న.

వద్దు లాక్ డౌన్ ఉన్నన్నాళ్ళు బయటకు వద్దు.. ఇంటికే పరిమితం అవుదాం…బయటకు పోయి కరోనాతో కరచాలనం చేసి, ఇంట్లోవారితో కరోనాతో కరచాలనం చేయించవద్దు. కరోనా కట్టడికి కరములను ఉపయోగిస్తే, ప్రార్ధన చేసే పెదవులు కన్నా మిన్న. అయితే కరోనా కాలంలో చేతితో చేసే సాయం ఏమిటి అంటే, కరములు కట్టుకుని ఇంట్లో ఉండడం.

సామాజిక దూరం పాటించడంలో ముఖ్య పాత్ర కరములదే… కాబట్టి కరములపై నియంత్రణతో ఉండడం మేలు. మీకు మాత్రమే కాదు మీతోబాటు మిమ్మల్ని నమ్ముకున్నవారికి మేలు… మీతోబాటు మీ చుట్టు ప్రక్కల ఉన్న సమాజానికి మేలు… ఇప్పుడు కరములను కంట్రోలు చేసుకోవడం వలన పెద్ద సామాజిక సేవే జరుగుతుంది. లేకపోతే కరోనా వలన పోయే ప్రాణానికి మీరు కారణం కావచ్చోమే…

ఇంట్లోనే ఉంటూ ఏదో పని చేయడం వలన కాలయాపన అవుతుంది. అయితే ఆ కాలయాపన చేసే కరములు బయట ఎక్కడా ఏ వస్తువును తాకకుండా ఉండి ఉండాలి. ఒకవేళ తాకిన కరములు శుభ్రపరచుకోవాలి. కరచాలనం చేయకుండా నమస్కారం మేలు.

ఇంటికే పరిమితం కమ్మని చెప్పినవారు వైద్యులు, పెద్దలు, పండితులు, క్రీడాకారులు, నటులు ఇలా అంతా అందరినీ ఇంటికే పరమితం కమ్మని కమ్మగా చెబుతుంటే, వినని వీనులు ఉంటే, వీక్షించండి టివిలు. చూడండి న్యూస్, చానల్స్ కరోనా అప్డేట్స్ అందుతాయి. కరోనా జాగ్రత్తలు వినబడతాయి.

వీక్షించిన కనులు కాళ్ళకు బుద్ది చెప్పకుండా బయటకుపోయి కరములకు పని చెబితే కరోనాతో కరచాలనం చేసినట్టే అవుతుంది. కరోనాతో కరచాలనం అంటే కొరివితో తల గోక్కున్నట్టే… కాబట్టి ప్రధానంగా నిధానం వహించి ఇంట్లోనే ఉండండి. సామాజిక దూరం పాటించడంలో కరములకు పని చెప్పండి. కాళ్ళకు బుద్ది చెప్పి, ఇంటికే పరిమితం అవ్వండి….

maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే...
maybe corona hugged బయటకు పోతే కరోనాతో కరచాలనం చేసినట్టే…

ఇది వ్వక్తి వ్యధ కాదు సామాజిక వ్యధ… ఇది వ్యక్తి గోల కాదు సామాజిక గోల… ఇది వ్యక్తి శ్రేయస్సు కోసమే కాదు, సామాజిక శ్రేయస్సు కోసం…..

మనం ఎలా ఉంటామో మనకు కాలం గ్యారంటీ ఇవ్వదు. ఈరోజు బాగున్నట్టు ఉంటుంది. రేపటికి స్థితి మారుతుంది. అనుకున్నట్టే కాకుండా అనుకోనట్టుగా, అనుకుంటున్నదే అయ్యేవిధంగానూ కాలంలో ఫలితాలు ఉంటాయి. స్థితి ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, కాబట్టి ఉన్న సమయంలో చేయవలసిన మంచిని చేయమని చెబుతారు.

విపత్తుకాలంలో చేయవలసినది ఖచ్చితంగా చేయాలి. విపత్తు ఒక్కరికి పరమితం కాదు. ప్రాంతాలకు సంబంధించిందై అనేకమందిని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఈ కరోనా అంటువ్యాధి అలా ప్రపంచం మొత్నాన్ని విపత్తులోకి నెట్టింది. ఈ కరోనా కాలం మనం చేయవలసినది, ప్రభుత్వాలు చెప్పినదే…

సామాజిక దూరం… సామాజిక దూరం… సామాజిక దూరం… ఇంటికే పరిమితం… ఇంట్లోనే ఉండడం… ఇంటి నుండి బయటకు రాకపోవడం… అత్యవసరం అయితే తగు జాగ్రత్తలతో పనిముగించుకుని ఇంటికి చేరడం… చేతులు శుభ్రం చేసుకోవడం… ఇలా వైద్యులు సూచించిన కరోనా జాగ్రత్తలు పాటించాలి… మన జాగ్రత్తే మనకు రక్షణ… మన తోటివారికి రక్షణ… అదే సమజానికి శ్రీరామరక్ష….

maybe corona hugged at anywhere at any place. Because it is the contagious disease.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.