Coronavirus tipps కరోనా టిప్స్

Coronavirus tipps కరోనా కు ప్రత్యేక మందు ఇంకా లేదు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధానం. జాగ్రత్తలలో ప్రధానంగా సామాజిక దూరం పాటించడం… ఇంట్లోనే ఉండడం. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లడం, అదీ ఒంటరిగా…

Coronavirus tipps కరోనా టిప్స్
Coronavirus tipps కరోనా టిప్స్

కంటికి కనబడని కరోనాకు వ్యాప్తి చెందడం గుణం అయితే అదీ బౌతిక శరీర వ్యవస్థను పాడు చేస్తుంది. కదలని కర్రలాంటి వస్తువులను, రాళ్ళు రప్పల్లాంటి వాటిపై కొద్ది కాలం ఉంటే, మరి కొన్ని వస్తువులపై ఇంకొంత కాలం ఉంటుంది. అంటే ఆ తర్వాత అది మరణిస్తుందనే కదా…

కాబట్టి Coronavirus tipps కరోనా టిప్స్ అంటే కేవలం ఇంట్లోనే ఉండడం, సామాజిక దూరం పాటించడం… ఇంటిలోనే ఉండడం, సామాజిక దూరం పాటించడం.. ఇదే పెద్ద సమస్య కూడాను.

పని చేసే అలవాటు ఉంటేనే ఆపనిచేస్తూ మరొక ఆలోచనవైపు కదిలిపోయే మనసు, ఖాళీగా ఉంటే, కుదురుంటుందా?

ఖచ్చితంగా ఉండదనే చెబుతారు. రోడ్లపై తిరగడం అలవాటు అయినవారు ఒత్తిడిలోనూ కాసేపు తీరిక ఏర్పరచుకుని రోడ్డుపై షికారు కొట్టేవారు ఉంటారు. కానీ కరోనా సోకితే ప్రాణం పోతుందనే భయం వలన చాలామంది ఇంటికే పరిమితం అవుతారు. కానీ కొందరు మాత్రం రోడ్డుపైకి వస్తూ ఉంటారు.

కరోనా కలుగుతుందేమో అని భావించి ఇంట్లోనే ఉండేవారికి మాత్రం చాలా అవకాశాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే

  • వ్యక్తిగత, కుటుంబ సమస్యలు.
  • వృత్తిపరంగా తెలియని విషయాలలో అవగాహన పెంచుకోవడం.
  • సంప్రదాయపరమైన ఆలోచనలను కొనసాగించడానికి విజ్ఙానం

ముందుగా తమ వ్యక్తిగత, కుటుంబ సమస్యలపై పరిశీలన చేయడం.

ఎందుకంటే ఎవరి జీవితంలోనైనా ఉండే ఒత్తిడి రెండు రకాలుగానే ఒక్కటి వ్యక్తిగతంగా…, లేక కుటుంబ పరంగా…. అయితే కుటుంబపరమైన సమస్యలు అంటే దాదాపు బయటకు తిరిగే విషయాలతో ముడిపడి ఉండవచ్చును. అలా ఉంటే వాటిని వదిలి వ్యక్తిగత సమస్యలపై దృష్టి సారించడం. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండి పరిష్కరించుకునే సమస్యలు కుటుంబపరంగానైనా, వ్యక్తిగతంగానైనా పర్సనాలిటీ డవలప్ మెంట్ కు సంబంధించే ఉంటాయి.

కాబట్టి పర్సనాలిటీ డవలప్ మెంటు గురించి దృష్టి సారించడం. సాధారణంగా వృత్తి ఒత్తిడిలో మనం గమనించం కానీ మన ప్రవర్తన వలన సహోద్యుగులు ఇబ్బంది పడి ఉండవచ్చును. అలా ఇబ్బంది పడ్డవారు కానీ, లేదా మీ స్నేహితులు గానీ మీకు నోటీస్ చేసే ఉంటారు. కానీ వృత్తి, హోదా వాటిని ప్రక్కన పెట్టేస్తాం. అయితే ఈ కరోనా వలన వచ్చిన గ్యాప్ లో ఒక్కసారి వృత్తి వ్యవహారాలలో మన తప్పులు మనం ఎంచుకోవడం మొదలు పెడితే, మనం చేసిన పొరపాట్లు మనకు తెలియవస్తాయి.

Coronavirus tipps కరోనా టిప్స్
Coronavirus tipps కరోనా టిప్స్

ఇక వ్యక్తిగతంగానో వృత్తిపరంగానో ఒత్తిడిలో పొరపాట్లు సాధారణమే కానీ పదే పదే అవే పొరపాట్లు పెరిగితే, తోటివారికి ఇబ్బంది కాబట్టి, వాటిపై దృష్టి సారించడం ఉత్తమం. అయితే అంత సులభం కాదు… అలవాటు అయిన మనసును మార్చడం. అలా ఒక విధానానికి అలవాటు పడిన మనసును మార్చాలంటే సజ్జన సాంగత్యం కావాలి. ఇప్పుడు ఒంటరిగా ఉండమంటే మరొక మనిషి మనకెందుకు… కాబట్టి సజ్జన సాంగత్యంతో సమానంగా మరొక పనిని చెబుతారు. అదే బుక్ రీడింగ్… పుస్తక పఠనం. పుస్తకాలు చదవడం వలన విజ్ఙానం పెరుగుతుంది, అంటారు. తెలిసిన విషయాలలో మరింత అవగాహన వస్తుందని అంటారు.

ఇలా మనం మన మనసును పరిశీలన చేసుకోవచ్చును. చిత్రంగా ఇప్పుడ కరోనా కట్టడికోసం ఇంట్లోనే కూర్చుని ఏమి ముట్టుకోకుండా ఉండాలంటే కూడా మనసు మనసుపై నియంత్రణ అవసరం. బుక్ రీడింగ్ ఒక్కటే ఒంటరిగా ఉంచుతుంది. కాసేపు మీలోకం నుండి మరొక లోకాని తీసుకువెళుతుంది.

మీ అభిరుచి ఫిక్షన్ బుక్స్ చదవడం అయితే మీరు మరొ కల్పిత లోకం బుక్ రీడింగ్ వలన కల్పించుకోవచ్చును. మీ అభిరుచి సైన్స్ అయితే సైన్స్ పరంగా విజ్ఙానం అందుకోవచ్చును. మీ అభిరుచి ఏదైనా కొత్త పనిని నేర్చుకోవడం అయితే బుక్ రీడింగ్ ద్వారా ఆ పని విధానపరమై విషయాలలో అవగాహన పెంచుకోవచ్చును. ఇలా బుక్ రీడింగ్ మనల్ని మరో లోకంలోకి తీసుకువెళుతుంది. మనసు దారి మళ్ళించాలంటే మంచి పుస్తకం మించినది ఏముంటుంది?

వృత్తిపరంగా తెలియని విషయాలలో అవగాహన పెంచుకోవడం.

వృత్తిపరంగా తెలియని విషయాలలో అవగాహన పెంచుకోవడం. ఉగ్యోగపరంగా మనం చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండదు. చదివిన చదుకు సంబంధించి ఉద్యోగం చేస్తేనే, మరలా వృత్తిపరమైన సందేహాలు వస్తూ ఉంటాయి. ఇక చదివిన చదువుకు చేస్తున్న పనికి పొంతన లేకపోతే, సందేహాలు మరింతగా ఉంటాయి.

Coronavirus tipps కరోనా టిప్స్
Coronavirus tipps కరోనా టిప్స్

పనిని ఫాలో శ్రద్దగా అయినప్పుడు ఉండవు. కానీ పనిలో ఆటంకం ఏర్పడినప్పుడు కొత్త సందేహాలు వస్తాయి. ఇలా పనికి సంబంధించినప్పుడు వచ్చిన సందేహాలకు సమాదానాలు గతంలో దొరకకపోతే, ఇప్పుడు కరోనా కల్పించిన గ్యాప్ లో ఇంటర్నెట్ ద్వారా తీర్చుకోవచ్చును. ఇక ఉన్న ఉద్యోగంలో స్థానం పెరగడానికి కూడా ఇప్పుడు కావాల్సిన వృత్తిపరమైన సమాచారం మనం నెట్ ద్వారా ఇంటర్నెట్ ఆధారిత పరికరాలతో తెలుసుకోవచ్చును.

సంప్రదాయపరమైన ఆలోచనలను కొనసాగించడానికి విజ్ఙానం

సంప్రదాయపరమైన ఆలోచనలను కొనసాగించడానికి విజ్ఙానం అంటే ప్రపంచం ఎన్నో విభిన్న సంస్కృతులతో కలిసి ఉంటుంది. వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలు మనోబలాన్నిస్తాయి. అందుకే ఒక సంప్రదాయం కొనసాగించేవరకు మరొక సంప్రదాయం వారికి పొసగదు. పద్దతి పొసిగినా పొసగకపోయినా సమాజంలో ఉండే మానవతా దృక్పదం మనిషికి మనిషిక సంబంధాన్ని కొనసాగిస్తుంది. మనుషుల్లో ఉంటేనే ఆ దృక్పధం సమాజంలో ఉంటుంది. అయితే సమాజంలో చెడ ఉందన్నా, మంచి ఉందన్నా అది కూడా మనుషుల్లో నుండి వచ్చేది.

ప్రపంచంలో అందరికీ అనేక సంప్రదాయాలు ఉంటాయి. అవే ఆయా ప్రాంతాలవారికి మనోబలంగా ఉంటాయి. ఒక్కసారిగా కొత్త వాటికి అలవాటు పడరు. ఒక్కసారిగా పాతవాటిని వదులుకోరు. ఏదైనా ఒక కొత్తవిధానం చాలా నిధానంగా అలవరుతుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చి పదిసంవత్సరాలు దాటింది. అయినా వందశాతం స్మార్ట్ ఫోన్ వాడే ప్రాంతాలు చాలా తక్కువ అంటే, టెక్నాలజీ అయినా అలవాటు పడడానికి సంవత్సరాల కాలం పడుతుంది.

అయితే పూర్వం నుండి వచ్చిన సంప్రదాయంలో ఏదో సామాజిక ప్రయోజనం భవిష్యత్తును ఊహించే పెట్టి ఉంటారు. అలాంటవన్నీ కాలంలో ఒక్కోసారి తప్పుగానో, ఒక్కోసారి ఒప్పుగానో కనిపిస్తాయి. ఎప్పుడూ ఒంటరిగా ఉండడం అనేది గత సంవత్సరం వరకు అందరూ ఒప్పుకోరు. కానీ నేడు ఒంటరిగా ఉంటేనే మేలు అనే ప్రచారం ముమ్మరంగా ఉంటుంది. కొద్దిరోజుల పాటు ఏది పడితే అది ముట్టుకోకుండా ఒక యోగిలాగా మారమంటున్నారు. అంతలాగా ఉంటేనే కరోనా కట్టడికి సాధ్యం అనేది నేటి మాట.

ప్రతి వస్తువు మీద ఏదో ఒక పదార్ధం ఉంటుంది. దానిపై ఏదో ఒక వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ఆరోగ్యానికి హాని చేయకపోతే, కొన్ని హాని తలపెతాయి. కొన్ని ప్రాణాంతకమైనవిగా ఉంటాయి. అవి అప్పుడప్పుడు ప్రబలి ప్రజలను కబలిస్తాయి. కరోనా అటువంటిదే. అయితే కరోనా ప్రతి వస్తువును కాల్చేసుకుంటూ పోవడం లేదు. ప్రతి వస్తువు రూపు మార్చేయడంలేదు. బలంగా ఆరోగ్యం ఉన్న వ్యక్తిలో అయితే దాని ప్రభావం వెంటనే చూపించడంలేదు. అంటే కొద్దిరోజలు పాటు జీవంతో ఉండే కరోనా వైరస్ అది వ్యాప్తి చెందిన చోట గుణాన్ని బట్టి ఆయష్షు మార్చుకుంటుంది.

Coronavirus tipps కరోనా టిప్స్
Coronavirus tipps కరోనా టిప్స్

మన మనసు కదలకుండా ఒంటరిగా ఉంటే, వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చును. మన మనసు కదలకుండా ఉంటే, మనం ఎక్కడికి కదలాలని అనుకోము. అయితే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా… మనసు మనిషికన్నా ముందుగానే మరొక చోటకి వెళ్ళిపోతుంది. కాబట్టి అది కదలని వ్యక్తిలో కుదురుగా కూర్చోదు. ఇలాంటి మనసుపై మనోవిజ్ఙానం అందించే సంప్రదాయం, భారతీయ సంప్రదాయంలో ఉంటుంది. అయితే అవి ఇప్పుడు పుస్తకరూపంలో ఉంటాయి. కావునా భారతీయ సంప్రదాయ పుస్తకాలు చదివితే, మనసు, దాని సంసారం గురించి తెలియవస్తుంది. అది కాకుండా వేరే వ్యాపకం ఉంటే వేరు బుక్స్ చదవడం మేలు.

మనసును నియంత్రించాలంటే ముందు దానికిష్టమైన అంశంతోనే మొదలుపెట్టాలి. చిన్నపిల్లలకు ఇష్టమైన పాటలు పాడి అన్నం తినిపించినట్టు, ఇష్టమైనవి ఇచ్చి కూర్చొబెట్టినట్టుగా… అని పెద్దలు చెబుతారు.

Coronavirus tipps కరోనా టిప్స్ అని అవి చేయండి, ఇవి చేయండి… ఇవి అందరికీ తెలిసినవే… కానీ ఎవరో చెబితే తెలుసుకునే విషయాలు కన్నా మనకు వ్యక్తిగతంగా అవసరమైన విషయాలు ముఖ్యం. మనం ఏదో సాఫ్ట్ వేర్ నేర్చుకోవాలి. మన మనసు సాఫ్ట్ వేర్ పై ఉంటే, యోగా చేయమంటే మాత్రం మొదలుపెట్టిన కొన్నాళ్ళకు మరలా మనసు సాఫ్ట్ వేర్ నేర్చుకోవడం కొరకు వెంపర్లాడుతుంది. అదే సాప్ట్ వేరు యొక్క తీరు, అది పనిచేసే గుణాలు, దాని నిర్మాణం వీటి గురించి తెలుసుకుంటూ ఉంటే, ఆ సాఫ్ట్ వేర్ పై మరింత అవగాహన పెరుగుతుంది. అలాగే భక్తిపై ధ్యాస ఉంటే ఒంటరిగా ధ్యానం చేసుకోవడం. ఏదైనా మన కుటుంబ అవసరాలు దాటి ఖర్చుతోకాకుండా, మనకు వ్యక్తిగతంగా మేలుచేసే మన అభిరుచికి తగిన విషయంలో మనం శ్రద్ధపెడితే… అది ఉపయుక్తంగా ఉంటుంది. మనసులేని చోట భగవంతుడు కూడా మాయగానే కనబడతాడు.

Coronavirus tipps కరోనా టిప్స్
Coronavirus tipps కరోనా టిప్స్

అందుకే మనసుకు నచ్చింది అయి ఉండి, ఆ పనిని చేయడం వలన ఇతరులు ఇబ్బందుకు గురి కాకుండా ఉంటే, ఇంకా ఆపని వలన పరిస్థితులు పూర్తిగా తారుమారు కాకుండా ఉండేలాగా ఉంటే అటువంటి వ్యక్తిగత అభిరుచికి తగ్గట్టుగా మనం విషయం నేర్చుకోవడం, సాధించడానికి ప్రయత్నం చేయవచ్చును.

మనసుకు నచ్చింది కదా అని, అదే పనిగా తిరిగితే కరోనా వస్తుంది. అలాగే మనసుకు నచ్చింది కదా అనే అదేపనిగా ఇంట్లో ఉండి టివిలు చూస్తూ ఉంటే, కళ్ల ఇబ్బందులు కలుగుతాయి. మనసుకు నచ్చింది కదా అనే అదే పనిగా ఫోన్ మాట్లాడితే చెవికి ఇబ్బంది. అవతలివారికి ఇబ్బంది. మనసుకు నచ్చడమంటే… టివి చూడడం ఇష్టం అయితే. ఆ టివి చూస్తూ మనసులో కలిగే భావాలను అప్పుడప్పుడు పుస్తకంపై వ్రాస్తే, సమాజం పై మీకు ఉన్న అవగాహనా శక్తి మీకు తెలుస్తుంది. మీలో ఉన్న సమాజిక దృక్పధం లోతు మీకు తెలుస్తుంది. మనసుకు టివి చూడడం ఇష్టమే కానీ ఆటివిని చూస్తూ దానికి సంబంధించిన విషయంపై సాధనకు మరొక సాధనం ఉపయోగిస్తూ ఉండడం వలన మనసులో ఉన్న విషయంపై మీకు మరింత అవగాహన ఉంటుంది.

Coronavirus tipps కరోనా టిప్స్
Coronavirus tipps కరోనా టిప్స్

ఇలా మనసుకున్న ఒక ఇష్టాన్ని మరొక సాధనంతో సాధన చేయడం మొదలుపెడితే, మనసులో ఏదైనా అపోహ ఉంటే పోతుంది. ఉన్న విషయంలో సారం తెలియవస్తుంది. ఇప్పుడున్న కాలంలో మనసును నియంత్రించడమే మేలైన విషయంగా ఉంది. కాబట్టి మనసుకు నచ్చిన విషయంలో మనసును సాధించడంలో దృష్టిపెడితే, వ్యక్తిగతంగా ఒక మెట్టు పెంచుకున్నట్టే…

కరోనా ఆగకుండా కదులుతున్న వ్యక్తుల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాపించినది మరలా కదిలే కదలికలన బట్టి దాని వేగం పెరుగుతుంది. కాబట్టి కరోనా సోకిన వ్యక్తి వైద్యుల పర్యవేక్షణలో ఉంటే, సమాజంలో కరోనా వ్యాప్తి తగ్గుతుంది. కరోనా లక్షణాలు త్వరగా తెలియవు కాబట్టి అందరం ఇంటికే పరిమితం కావాలి. Coronavirus tipps కరోనా టిప్స్ అంటే సామాజిక దూరం, బయటకు పోకపోవడం…

ఈ ఆదివారం రోజున ప్రధాని నరేంద్ర మోదీగారు పిలుపు మేరకు మనం దీపం పెడదాం… కరోనా తరమికొట్టే ప్రయత్నాలు విజయవంతం కావాలనే బలమైన సంకల్పం మనస్ఫూర్తిగా చేద్దాం… దీపం వెలిగించి ఆకాంతులతో అందరిలోనూ ఉన్న ఐక్యతను చాటుదాం…

ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.