నానాటికీ సమాజంలో పుకారు

నానాటికీ సమాజంలో పుకారు షికారు చేయడం ఆగడంలేదు. అదేంటో వార్త వ్యాపించడం కన్నా అతివేగంగా పుకార్లు పుడుతునే ప్రపంచం చుట్టి వచ్చేస్తాయి. ఒకప్పుడు టెక్నాలజీ అంతగా లేనప్పుడు ఎవరో ఒకరు ఏదో చెబితే, అది ప్రచారం అయ్యి పెద్ద పుకారుగా మారేది.

కానీ నేటి మన సమాజంలో టెక్నాలజీ అందుబాటులో ఉండి, ఆన్ లైన్ ద్వారా న్యూస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. టివిలు, యూట్యూబ్ చానల్స్, పత్రికలు ఇలా ఒక నియంత్రణ కలిగి సంస్థల మీడియా ఉంది. అయినప్పటికీ పుకారుకు, వార్తకు వ్యత్యాసం తెలియకుండా పుకార్లు షికారు చేయడం విశేషం.

ఈ పుకారు వార్తల వలన నష్టపోయేది, సమాజంలో ఉండే మనతోటి మనుషులే. పుకారు వలన కంగారు పెరిగితే అనారోగ్యం పాలు అయ్యేది మనతోటివారే. పుకారు పుట్టించినంత తేలిక కాదు, సమాజంలో నష్ట నివారణ చర్యలు చేపట్టడం.

ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఈ పుకార్లు మరితంగా పుంజుకుంటాయి. వీటి వలన ప్రజలు ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేరు. పుకారు వలన వార్తను కూడా పుకారు అనుకునే అవకాశం కూడా ఉంటుంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ పుకారు వార్తలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏదో ఒక్కటి సృష్టించి, దానిని వ్యాపింపజేయడం, సోషల్ మీడియా అంటే సోదీ న్యూస్ అనుకునేట్టుగా పుకార్లు పుడుతున్నాయి.

న్యూస్ పేపర్లు వలన వైరస్ వస్తుందనే విషయం ఆధారంగా న్యూస్ పేపరు అడ్డుకోకూడదు అని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలో సోషల్ మీడియా కన్నా న్యూస్ పేపర్లలో న్యూస్ పైనే నమ్మకం ఎక్కువ అని అన్నారు. అంటే సోషల్ మీడియాపై విజ్ఙులకు కలిగే అభిప్రాయం ఎలా ఉంటుందో? ఆలోచించాలి.

నానాటికీ సమాజంలో పుకారు

ఇంకా ఈ రోజు తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రెస్ మీట్లో కూడా పుకారు వార్తలపై ఫైర్ అయ్యారు. అంటే ఈ పుకారు న్యూస్ వ్యాప్తి చేయడం వలన ఆ వ్యాప్తికి వాడుకున్న మీడియాపై నమ్మకం ఉండదు. ఇక అప్పుడు సోషల్ మీడియా వలన సమాజానికి మేలు ఏమిటి?

నానాటికీ సమాజంలో పుకారు

నానాటికీ టెక్నాలజీ వృద్ది చెందుతుందంటే అది వాస్తవాలకు అడ్డాగా మారాలి. కానీ పుకార్లు షికారు చేయడం కోసం కారాదు.

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.