Lock Down లాక్ డౌన్ ?

లాక్ డౌన్ పొడిగిస్తారా? లాక్ డౌన్ ఎత్తివేస్తారా? ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కరోనా కారణంగా ఈనెల 14వరకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. గడువు సమీపిస్తుంది, గడువు తర్వాత లాక్ డౌన్(Lock Down) ఉంటుందా? ఉండదా? అందరి మనసులో మెదిలే ప్రశ్న.

ఇప్పుడున్న పరిస్థితులలో లాక్ డౌన్ ఇంకా కొన్నాళ్ళు పొడిగించాలి. నేను ప్రధానికి కూడా విజ్ఙప్తి చేస్తున్న, అంటూ లాక్ డౌన్ విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ నిన్న ప్రెస్ మీట్లో తన అభిప్రాయం వెల్లడిచేశారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్(Lock Down) విధించింది… ఏదో వ్యాపార లావాదేవీల గురించో లేక అల్లర్ల గురించో కాదు… దేశప్రజల ప్రాణ రక్షణ కోసం…. ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం.. ఇంది అందరికీ తెలిసిన పచ్చి నిజం కాబట్టి, విపత్కర సమయంలో ప్రాణరక్షణకే ప్రాధన్యత ఉంటుంది.

కరోనా విపత్తు వలన జరగబోయే ప్రమాదం ముందుగానే ఊహించిన కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్(Lock Down) సరైనసమయంలోనే విధించాయి. తత్ఫలితంగా ప్రపంచదేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. కానీ కరోనా కేసులు నాలుగువేలు దాటాయి. కోవిడ్ 19 కారణంగా 100మందికి పైగా మరణించారు. మూడువందలకు పైగా కోలుకున్నారు.

కరోనా పాజిటివ్ కేసులు లాక్ డౌన్ కారణంగానే తక్కువగానే ఉన్నవి. అయితే డిల్లి ప్రార్ధనల ఘటనతో ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆయా కరోనా వ్యాధిగ్రస్తులు ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరెవరిని కలిశారో పూర్తిస్థాయి నియంత్రణ జరగాలి. ఎందుకంటే కరోనా అంటువ్యాధి ఇది గుంపులో ఒక్కరికి ఉన్నా ఆ గుంపు అంతటికీ వస్తుంది.

Lock Down లాక్ డౌన్ ? పొడిగిస్తే

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నేపధ్యంలో ఎక్కువశాతం ప్రజలు ఇళ్ళకే పరిమితిం అయ్యారు. ఇప్పుడు లాక్ డౌన్(Lock Down) ఎత్తివేయడం జరిగితే ప్రజల కార్యకలాపాలు ఒక్కసారిగి వేగం పుంజుకుంటాయి. అందులో కరోనా ఉండి, దాని లక్షణాలు బయటపడని వ్యక్తి ఉంటే, మరలా కరోనా ప్రబలే అవకాశం లేకపోలేదు. కరోనా వచ్చి ఇంటికే పరిమితం అయినవారు, పరీక్షలకు హాజరుకాకుండా అలా తట్టుకుని లాక్ డౌన్(Lock Down) తర్వాత సమాజంలో తిరిగితే మరలా వారి వలన కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వం కరోనా వ్యాధి కట్టడి సమగ్రంగా పూర్తి చేశాకే లాక్ డౌన్(Lock Down) ఎత్తివేయాలని మనం కూడా కోరుకోవాలి. కానీ పరమిత కాలం ఇంట్లోనే ఉంటే కరోనా పోతుంది అనుకుంటే పొరపాటు. పూర్తిగా కరోనా కట్టడి అయితేనే మనకు మన సమాజానికి రక్షణ. లేకపోతే కంటికి కనబడని శత్రువు ఎక్కడ ఉందో, ఎవరికి ఉందో ఎవరికి తెలుసు… నిష్ణాతులైన డాక్టర్లు అయిన లక్షణాలు కనబడితే పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తారు. మరి విజృంభించిన కరోనా పడగపై బలమైన దెబ్బ పడకుండా పడగను వదిలేస్తే అది కాటు వేస్తుంది.

Lock Down లాక్ డౌన్ ?
Lock Down లాక్ డౌన్ ?

అదుపులో ఉన్నవ్యక్తి ఒక్కసారి బయటకు విడుదల చేస్తే, అతని మనసు గతం కన్నా వేగంగా కదులుతుంది. అంతకన్నా ఉత్సాహంగా ఉరుకులు పరుగులు పెడుతుంది. అటువంటిది స్వీయనిర్బంధంలో ఉన్న ప్రజలకు సడలింపు అంటే అది చాలా సంయమనం పాటించాలి. పాము పడగలాంటిదే అంటువ్యాధి లక్షణం కూడాను.

మరి కరోనా వంటి కరడుగట్టిన అంటువ్యాధి కోరలు పూర్తిగా నిర్మూలించాలి. దాని విషవ్యాప్తిని పూర్తిగా అరికట్టాలి. అప్పుడే స్వేచ్చగా ప్రజలు తిరగగలరు. అది జరగకుండా ఉంటే ఇప్పటిలాగానే పుకారు వార్తలు ఏవైనా పుడితే అవి మరింతగా నష్టం చేస్తాయి.

కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ (Lock Down) మన ప్రాణ రక్షణకే కాబట్టి మన ప్రాణాలకు ముప్పు తెచ్చే కరోనా వ్యాధి సమూలంగా సమాజం నుండి పోవాలని కోరుకోవాలి. లాక్ డౌన్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్లు ఇంట్లోనే కూర్చోవాలి? ఈ ప్రశ్నలు కాదు కావాల్సింది… కరోనా కట్టడి ఎంతవరకు వచ్చింది? కరోనా సోకినవారు అంతా పరీక్షలు చేయించుకున్నారా? కరోనా వ్యాధిగ్రస్తులు పూర్తిగా కోలుకున్నారా? లేదా? ఇటువంటి న్యూస్ వలన కరోనా వ్యాధి తీవ్రత మన సమాజంలో ఎలా ఉందో మనకు తెలియవస్తుంది. కరోనా కోరలు బయట విషం చిమ్ముతుంటే దాని పారద్రోలే క్రమంలో మనం ఇంట్లో కూర్చున్నాం…. మన బయటకు వెళ్ళడం అంటే కరోనా విషాగ్నికి ఆజ్యం పోయడమే… కాబట్టి కరోనా విషాగ్ని తగ్గేవరకు మనపై మనకు నియంత్రణ ఉండాలి.

Lock Down లాక్ డౌన్ ?
Lock Down లాక్ డౌన్ ?

కంటికి కనబడని శత్రువుపై అనేకమంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారి వృత్తి పనులు వారు చేస్తున్నారు. వారి కంటికి కునుకు ఉందో లేదో కూడా మనకు తెలియదు. అలాంటి వారికి మనం మరింత పని పెంచేవిధంగా ఉండకూడదు. ఎంతటివారైనా ఒత్తిడికి లోనవుతారు. ఇంకా ప్రాణానికే ప్రమాదం ఎన్నాళ్లు ఒత్తిడిని తట్టుకోగలరు?

ఇంట్లో కూర్చోవడం వలన మన జీవితం ఏమిటి? ఆర్ధికంగా ఎలా? అంటూ ప్రశ్నలు వేసుకుంటే మనకు ఒత్తిడి పెరిగి ఎప్పుడు కరోనా పోతుందా అని ఆలోచిస్తాం… మరి కరోనా సోకితే ప్రాణాలు పోతాయో ? ఉంటాయో? కాలం నిర్ణయిస్తుంది. అటువంటి అంటువ్యాధి కరోనా వచ్చినవారికి వైద్యం చేస్తున్న డాక్టర్లు ఎంత ఒత్తిడికి గురవుతారు. మనం బయటకుపోతే కరోనా వ్యాప్తి చెందితే అది మరింత పనిని డాక్టర్లకు కల్పిస్తుంది. ప్రాణాలు పణంగా పెట్టి చేసే పని మరంత ఒత్తిడికి గురి చేస్తే దాని మరింతగా మనం పొడిగించ కూడదు. మన సహకారం అందించాలి. కరోనా కట్టడికి మనం కృషి చేయాలి.

Lock Down లాక్ డౌన్ ?
Lock Down లాక్ డౌన్ ?

రెండువారాలుగా ఇంట్లోనే ఉన్నాం… మరొకవారం, గత రెండువారాలు కన్నా మెరుగ్గా ఇంటికే పరిమితం అవుదాం… అప్పటి స్థితిని బట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఫాలో అవ్వవచ్చును. ఇప్పటికే రెండువారాలు అయిపోయాయి. మరొకవారమే కదా అని నిర్లక్ష్యం చేస్తే, అది మరిన్నివారాలకు పెరిగే అవకాశాలు ఉంటాయి.

Lock Down లాక్ డౌన్ ?
Lock Down లాక్ డౌన్ ?

నిర్లక్ష్యం ఎప్పుడూ భారీ మూల్యం చెల్లిస్తుంది. కాబట్టి మనం నిర్లక్షంగా ఉండవద్దు. కంటికి కనిపించే శత్రువు అయితే స్టేటస్ కనబడుతుంది. అంతానికి అంచానా వస్తుంది. కనబడని శత్రువు ఏవిధంగా నక్కి ఉందో తెలియదు. ఇది శాస్ర్రీయంగా పరిజ్ఙానం కలిగినవారే నిర్ధారించాలి కానీ మరొకరు కాదు. మరొకరు మనల్ని నియంత్రణలో ఉండమని శాసిస్తారు. కరోనా పోయింది… అనేది విశేష పరిజ్ఙానం ఉన్నవారే, అటువంటివారు ఎక్కడా కరోనా పోవడానికి ఇంకా సమయం పడుతుంది అంటున్నారు.

మన జాగ్రత్తలో మనం ఉంటే వారు చెప్పిన వేళకు అది పోయే అవకాశం ఉంటుంది. మన నిర్లక్ష్యంగా ఉంటే, మరలా వారు సమీక్షించుకుని మరలా ఇన్నాళ్లవరకు ఉండవచ్చును అనే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు కరోనా లక్షణాలు కలిగినవారికి వైద్యం చేయించడంలోనూ, సమాజంలో రోడ్లపై జనంలేకుండాను, మార్కెట్లను, వ్యవస్థలను మూయించగలవు. కానీ రోడ్డుపైకి వెళ్ళవద్దు. వెళితే కరోనా సోకుతందనే విషయం స్వీయనిర్బంధంగా ఎవరికివారే జాగ్రత్తలు తీసుకోవాలి.

తను పనిచేస్తున్న యజమానికి ఇంకో గంట ఎక్కువసేపు పనిచేస్తే అధిక లాభం కలుగుతుందంటే సంతోషంగా పనిచేస్తాం. మన నాయకుడుకు ఓట్లు పడడానికి రోజు రెండు మూడు గంటలు అదనంగా పని చేస్తూ ఉంటాం. టీ కొట్టుకు పోయి టీ ఇచ్చేవరకు వెయిట్ చేస్తాం… ఎక్కడకు వెళ్ళినా ఆ ప్రయోజం పొందేవరకు లేక అధిక ప్రయోజం ఉంటే దాని కొరకు వెయిట్ చేయడం మనకు అలవాటు.. అయితే మరి మన ప్రాణాలు, మనతో బాటు సమాజంలోని ఇతరుల ప్రాణరక్షణ మన నియంత్రణపైనే ఆధారపడి ఉంటే, ఎంతకాలం వెయిట్ చేయగలం…. వెయిట్ చేద్దాం..

Lock Down లాక్ డౌన్ ?
Lock Down లాక్ డౌన్ ?

Lock Down లాక్ డౌన్ ఎత్తివేయడం కాదు ప్రధానం… లాక్ డౌన్ కు కారణమైన కరోనా మహమ్మారిపై విజయం…. అదీ ధోని కళ్ళు చెదిరే సిక్సర్ షాట్ లాగా…. వివిఎస్ లక్ష్మణ్ – ద్రవిడ్లు ఆస్ట్రేలియా విజాయాన్ని, భారత్ పరాజయాన్ని అడ్డుకున్నట్టుగా… బాహుబలి సినిమా రికార్డులను తుడిచి కొత్త రికార్డులను క్రియేట్ చేసినట్టుగా కరోనా తరిమికొట్టడంలో… మన భారతదేశం… కాదు మన మానవాళి అటువంటి విజయం సాధించాలనే ఆకాంక్షను కలిగి ఉందాం… ఆదివారం ప్రధాని కోరకున్నది.. కరోనా పై పోరాటంలో తిరుగలేని విజయం సిద్దించాలనే సంకల్పం అందరూ చేయాలని…. మరి సంకల్పం చేశాం కదా… వెయిట్ చేయడం కూడా మన సంకల్పంలో భాగమే…. వెయిట్ చేయడమే యుద్దంలో ఆయుధం అయితే ఆ ఆయుధాన్ని మనం ఎందుకువదులకుని కనబడని శత్రువు ముందు నిలబడడం… ఆయుధంతో నిలబడదాం…

సామాజిక దూరం, ఇంటికే పరిమితం కావడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం తదితర వైద్యసూచనలు పాటిస్తూ మనం కరోనా కట్టడికి పూర్తి సహకారం అందిద్దాం… పోరాటం చేస్తున్న ప్రభుత్వ, ప్రవేటు యంత్రాంగానికి సంఘీభావం తెలిపాం.. చేసిన సంకల్పం గుర్తు చేసుకుంటూ ఆ సంఘీబావమునకు మరింత బలం పెంచుదాం….

మన భారతీయులంతా మనో వైజ్ఙానికులే.. ఎవరు ఎలా మాట్లాడగలరు? ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోగలరు? ఊహించగలరు. సినిమా కధను మనం ఊహిస్తున్నట్టుగా ఉంటూ ఉంటేనే ఆసక్తిగా చూస్తాం… ఎంతమందికి ఊహకు దగ్గరగా ఉంటే, అంతమంది ఆసక్తిగా సినిమాను చూస్తారు… అంటే సినిమాను హిట్ అవ్వడం అంటే దర్శకుల దార్శనికత, ప్రేక్షకుల ఊహ కలుస్తూ ఉండడం… అయితే మనం భారతీయలలో ఎంతమంది మనో విజ్ఙానవంతులు… కాబట్టి ఉన్న విజ్ఙానం వలన మనకు తెలుసు మనసు యొక్క శక్తి… సంకల్పం యొక్క శక్తి…. మంచి సంకల్పానికి మించిన శక్తిలేదు…

ఇప్పుడు మనంచేసిన మంచి సంకల్పమును గుర్తు చేసుకుంటూ చేసిన సంకల్పం నెరవేరాలిన ఆశిద్దాం… కోట్లాది మంది ఆశే ఒక అద్భుతం అవుతుంది. చాలామంది రాజకీయ విశ్లేషకులకు, ప్రపంచానికి మన నరేంద్రమోదీగారు ఒక అద్భుతంగానే కనబడతారు. ఆ అద్భుతం మన ఓటు వలననే కదా… సాధ్యం అయ్యింది…

ఇప్పుడు మనం లాక్ డౌన్ (Lock Down) గడువు కాదు ముఖ్యం కరోనాపై విజయం ముఖ్యం… అదే కోట్లాదిమంది సంకల్పం కూడాను… దాని కోసం మన ప్రయత్నం మనం చేద్దాం… ఇంటికే పరిమితం అవుదాం… సామాజిక దూరం పాటిద్దాం…

ధన్యవాదాలు…

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.