Physically keep social distance, mentally we fight against coronavirus బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు

Physically keep social distance, mentally we fight against coronavirus
Physically keep social distance, mentally we fight against coronavirus బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు

ఇంటికి పరిమితం బయటకు అసలు వద్దు. బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు ఇదే మన సంకల్పం. Physically keep social distance, mentally we fight against coronavirus.

మొన్నటిదాక మనకోసం మన కుటుంబం కోసం పాటుపడడం మనకు అలవాటు. ఇప్పుడు మనం పాటుపడకుండా ఉండడమే సమాజంలో మన వలన నష్టం జరగకుండా ఉంటుంది.

కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడం కోసం సినీ నటులు మీడియాద్వారా మాటలు చెబుతున్నారు. పాటలు పాడుతున్నారు. కరోనా వైరస్ గురించి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రేణుదేశాయ్, సాయికుమార్ తదితర తెలుగు సినిమా హీరోల సందేశం ఇస్తున్నారు. మనకు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడం కోసం. సామాజిక దూరం ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.

ఇంతమంది ఇన్నిరకాలుగా కరోనా వైరస్ గురించి చెబుతున్నారు అంటే, కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంటుందో మనం గుర్తించాలి. దాని కోరల కాటుకు మనం బలికాకుడదనే ప్రముఖులు కరోనా వైరస్ గురించి అవగాహనా వీడియోలు చేస్తున్నారు. కొందరు కరోనా వైరస్ గురించి పాటలు పాడుతున్నారు.

గతంలో ఖాళీగా ఉంటే అభివృద్ది ఉండదు. ఇప్పుడు పాటు అంటూ బయటకుపోతే, ఆ చర్యే సమాజానికి ముప్పుగా మారే అవకాశం.

మనకు ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, ఎన్నో కలలు ఉండేవి. అవి నెరనేర్చుకోవడానికి కాలంలో పరుగు పెడుతున్న మనముంగిట కరోనా వచ్చి నిలబడింది.

మన ముంగిట వచ్చి నిలబడిన కరోన కోరాల చాచి నిలబడింది. ‘నా కాటుకు అగ్రరాజ్యమే కుదేలు అవుతుంది. అధిక జనాభా గలదేశం జనాభా తరుగుదల గురించి ఆందోళన చెందింది.

అటువంటి కరోనా కట్టడికి లాక్ డౌన్ పాటిస్తున్న మనకు రెండువారాలు గడిచాయి, కరోనా కోరల నుండి విషం కక్కుతుంది. ఎవరిపై కక్కిందో ఎవరిద్వారా ఎవరికి వ్యాపిస్తుందో కరోనా లక్షణాల బయటపడితే తెలుస్తుంది. కరోనా సమూలంగా నివారించగలిగేవరకు మనం జాగ్రత్తగా ఉండాలి.

సామాజిక దూరమే మనకు రక్ష, ఇంటికే పరిమితం కావడం మనకు శ్రీరామరక్ష. అదే సమాజానికి కూడా శ్రీరామరక్ష. బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు కోరుకుందాం.

మనకోసం మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మన ప్రాణం మనకు ముఖ్యం. ఇప్పుడు ఎవరైనా కరోనా బాధితుడుగా మారే అవకాశం ఉంది. కాబట్టి కరోనా వ్యాపించకుండా మన జాగ్రత్త మనకు రక్షణగా ఉంటుంది. అదే సమాజాన్ని కూడా కాపాడుతుంది.

Physically keep social distance, mentally we fight against coronavirus
Physically keep social distance, mentally we fight against coronavirus బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు

మన జాగ్రత్త మనకు రక్ష అలాగే సమాజానికి రక్షణే. అయితే వదంతులు, పుకార్ల రూపంలో మనకు మరొక ఆందోళన కలిగించే వైరస్ ఉంది. ఇవి ఎందుకు పుడతాయో కారణం ఉండదు. కానీ అసలైన న్యూస్ కన్నా వేగంగా వ్యాపిస్తాయి. అవి పుకార్లు అని తేల్చి చెప్పే నిజం కూడా వెంటనే వ్యాపించలేనంత స్థాయిలో పుకార్లు ప్రపంచంలోకి పోతాయ్.

ప్రపంచంలోకి పాకిపోయిన పుకార్లు తగినంత నష్టాన్ని కూడా చేస్తూ ఉంటాయి. నిజమని నమ్మే ప్రజలు సమయం వృదా చేసుకుంటారు. ఇంకా ఏదైనా విశేషం జరుగుతున్నప్పుడు ఎక్కువమంది ఏవిషయంపై దృష్టిపెడతారో అలాంటి వాటిపై పుకార్లు పుట్టుకొస్తాయి. ఇప్పుడు కరోనా గురించి ప్రపంచం అల్లాడుతుంటే, కరోనాపై కూడా పుకార్లు వ్యాపింపచేసేవారు ఉన్నారు. ఈ క్రింది వీడియో కరోనా గురించిన పుకార్లు..

Physically keep social distance, mentally we fight against coronavirus బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు

చాలా దేశాలలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మనదేశంలోకి వచ్చిందంటే మనకు ఆందోళనగానే ఉంటుంది. ఎవరికి వచ్చింది? ఎలా వ్యాపిస్తుంది? తెలుసుకుని జాగ్రత్త పడాలి అనే భావన ఉంటుంది. అయితే ఈ ఆసక్తిని వాడుకుని పుకార్లు వ్యాపింపచేసేవారు ఎక్కువగానే ఉంటారు. ఆందోళకరమైన సమయంలో పుకారు వార్తలకు దూరంగా ఉండాలి. ఆర్గనైజ్డ్ న్యూస్ మాత్రమే మనం నమ్మాలి. ఏదైనా పత్రిక లేక టివీ న్యూస్ చానల్ వార్తలను ఫాలో అవ్వాలి. ఆత్రం కొద్ది కొన్ని రకాల కొత్త చానల్స్ ఫాలో అయితే వచ్చేవి సందేహాలు మాత్రమే.

ఏదైనా మనసు చూడగానే చేసే భావనకు ప్రధాన్యత కన్నా కనిపిస్తున్న దానిలో మర్మమేటో వెతికేవారు విజ్ఙులు అంటారు. పుకార్లలో చూడవలసిన దృష్టి అదే… ముందుగా వస్తున్న వార్త పుకారు కాదా అని తెలియదు. అదేదో పెద్ద న్యూస్ గానే వచ్చి కనబడుతుంది. ఎప్పటినుండో సమాజంలో మీడియా రంగంలో ఉన్న కొన్ని న్యూస్ చానల్స్, పత్రికలలో చూసి స్పష్టత తీసుకోవాలి. అప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వ ప్రకటన కూడా చూడాలి. ఇప్పుడు ఈ కరోనా విషయంలో అయితే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రకటనలనే నమ్మాలి.

Physically keep social distance, mentally we fight against coronavirus
Physically keep social distance, mentally we fight against coronavirus బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు

పుకారు మాటలు మత్తునిచ్చేవిగా ఉంటాయి. అవి మనల్ని అప్పటికప్పుడు ఉద్దరించేవిగా లేకపోతే భయపెట్టేవిగా ఉండవచ్చును. కరోనా కాలంలో మనల్ని మనం ఉద్దరించుకోవడంలో ముందుండాలి. బయటకుపోతే ఎక్కడ కరోనా కోరలు చాచిందో తెలియదు. ఎక్కడ దాని కాటుకు ప్రభావం అయిన స్థానం ఉందో మనకు తెలియదు. ముందు కరోనా కట్టడికి మనం బౌతికంగా సామాజిక దూరం పాటించడం ప్రధానం.

ఈ కరోనా చెడ్డవాడికి వచ్చినా మంచివానికి సోకకుండా ఉండదు. మంచివానికి వచ్చిన చెడ్డవానికి సోకకుండా ఉండదు. దానికి మంచి చెడుల పక్షపాతం ఉండదు. బాధించడం దానిలక్షణం అందుకే కదా అందరికీ భయం. కాబట్టి కరోనా సోకకుండా జాగ్రత్తపడదాం. మనం రక్షణాత్మక దోరణిలో సాగి, సామాజిక భద్రతకు పాటుపడదాం.

Physically keep social distance, mentally we fight against coronavirus

బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం. ఇదే మన సంకల్పం. మన ఆచరణ కావాలి. కరోనా కోరలకు చిక్కకుండా ఉందాం.

ఈ కరోనా అంటువ్యాధి.. లక్షణాలు కలిగినవారు ఆసుపత్రులలో చికిత్స పొంది బయటపడ్డవారు ఉన్నారంటే, మనం వ్యాధి లక్షణాలు గుర్తిస్తే, మన రక్షణకోసం మనం ఆసుపత్రికి వెళితే ప్రాణహాని ఉండదు.

అయితే కంగారు ఆందోళన వలన మనసు ముందుగా రోగిగా మారుతుందంటారు. కాబట్టి కరోనా అంటువ్యాధి కాబట్టి ఎక్కువమందికి వ్యాపించే అవకాశం ఉంది. కనుక ఇంటికే పరిమితం అయితే అది సోకే అవకాశం చాలా తక్కువ. సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వ్యాప్తి అడ్డుకట్ట వేసినట్టే అవుతుంది.

కరోనా వైరస్ గురించి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన వివరాలు అధికారిక వెబ్ సైట్లలో అందిస్తున్నారు. మీరు అధికారిక వెబ్ సైట్లద్వారా కొవిడ్ -19 న్యూస్ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సైటును చూడవచ్చును. ఈ క్రింది బటనుకు ఇండియన్ గవర్నమెంట్ అధికారిక వెబ్ సైటు లింకు చేయడం జరిగింది.

Physically keep social distance, mentally we fight against coronavirus
Physically keep social distance, mentally we fight against coronavirus బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు

చెరువులో స్నానం చేసేవారికి నదిలో స్నానం తొలుత భయం కలిగిస్తే, సముద్రస్నానం కూడా తొలుత భయంగానే ఉంటుంది. వేగం వచ్చే వాటర్ మనల్ని ముంచేస్తుందనే ఆందోళన ఉంటుంది.

సమాజంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కూడా సముద్రపు అలలకు దాటనిచ్చినట్టుగా సమాజంలో వ్యవహరిస్తే విపత్తు మనల్ని దాటి పోతుంది. మనపై కరోనా పుకార్లు అలలుగా రావచ్చును. లేక కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మనకు తెలియకుండా మనలో మెసిలి ఉండవచ్చును. లక్షణం కనబడితే వైద్యుని సంప్రదించడం. లేకపోతే సమాజిక దూరం పాటించి ఇంట్లోనే ఉండడం…

ఇంటికే పరిమితం కావడం ప్రధానం.. సామాజిక దూరం మనకున్న ఆయుధం… దీనిద్వారా కరోనా కోరలకు మనం దొరకము. అందువలనే అది ఏ రాయినో రప్పనో తాకి పోతుంది. మనపై కాకుండా వస్తువులపై అట్టేకాలం జీవించి ఉండదు. కాబట్టి అదే పోతుంది. దానిని వ్యాప్తి చెందనివ్వకుండా మనం జాగ్రత్త వహించగలిగితే చాలు. అదే మనకు పదివేలు.. సమాజానికి శ్రీరామరక్ష…

బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు Physically keep social distance, mentally we fight against coronavirus కోసం బలమైన సంకల్పంతో లాక్ డౌన్ కాలం గడుపుదాం. ఈ కాలంలో ఏదైనా కొత్తగా నేర్చుకోవడం లేకపోతే ఏదైనా పుస్తకం చదవడం లాంటి మంచి పనులు చేద్దాం..

Physically keep social distance, mentally we fight against coronavirus
Physically keep social distance, mentally we fight against coronavirus బౌతికంగా సామాజిక దూరం, మానసికంగా సామాజిక శ్రేయస్సు

నానాటికీ కరోనా వైరస్ పెరుగుతూ కనబడవచ్చును. కానీ పెరుగుట విరుగుట కొరకే అనే సామెత గుర్తుకు తెచ్చుకుని ఓపిక పడదాం… అర్ధిక విషయాలు మనసును కుదురుగా ఉండనివ్వవు కానీ ఆరోగ్యం, ప్రాణాలు ముఖ్యం. కాబట్టి కరోనా కాలం పోయేవరకు మన ఇంటికే పరిమితం అవుదాం.

ప్రపంచ దేశాలలో ఆర్ధికమైన నష్టం గురించి ఆలోచించడం వలననేమో కొన్నిదేశాలు మొదట్లో తక్కువగా ఉన్నా తరువాత విజృంభించాయి. కొన్ని కరోనా పోయిందని భావించి నష్టపోయిన దేశాలు నేడు కనబడుతున్నాయి. వాటికి అలా జరిగింది అంటే వాటి నుండి మనం పాఠం నేర్చుకోవాలి అని అర్ధం.

లాక్ డౌన్ పోయేవరకు మాత్రమే మన జాగ్రత్త కాదు, కరోనా పూర్తిగా పోయేవరకు సాగాలి. మన జాగ్రత్తలు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిద్దాం. కరోనాను సమాజం నుండి ప్రారద్రోలుదాం…

కరోనా వైరస్ గురించి అనేకమంది జాగ్రత్తలు చెబుతున్నారు. కరోనాపై మనకు అవగాహన రావడం కోసం కరోనా గురించి కవితలు చెబుతున్నారు. కరోనా గురించి పాటలు పాడుతున్నారు. మనకు కరోనా వైరస్ గురించి పాటించవలసిన సామాజిక దూరం గురించి చాలా మంది చెబుతున్నారు. వారి సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. సామాజిక స్పృహ మనలో కలగాలి కరోనా వైరస్ గురించి మన జాగ్రత్త వహించాలి. ఇంటికే పరిమితంకావాలి.

వీలైనంతగా సామాజిక దూరంతో ఇంటికే పరిమితం అవుదాం. ఇంటినుండే కరోనా వైరస్ గురించి తెలుసుకుంటూ, ఇంట్లోనే ఉంటూ కరోనా కట్టడికి సహకరిద్దాం… Physically keep social distance, mentally we fight against coronavirus…

నానాన్యూస్

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *

కరోనా సమయం సంయమనం పాటించడం ప్రధానం.

పుట్టిన పుకారు షికారు చేయడం తేలియక కానీ దానిపై వాస్తవం అంతమందికి తిరిగి తెలిసేటప్పటిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం, మన మద్య బౌతిక సామాజిక దూరం, మానసికంగా కరోనా కట్టడికి సహకారం.